కమలాపూర్, వెలుగు: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో ప్రగతి యువజన సంక్షేమ సంఘం, ప్రగతి స్వచ్ఛంద సంస్థ 25 ఏండ్ల వేడుకల్లో భాగంగా శనివారం మహిళలకు కోలాటం పోటీలు నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కోలాట ప్రదర్శన చేశారు. రామాంజనేయ కోలాట బృందం మొదటి బహుమతి, శ్రీ కృష్ణ యాదవ్ కళా బృందం రెండో బహుమతి, శివరామ కృష్ణ కోలాట బృందం మూడో బహుమతి గెలుచుకున్నారు.
విజేతలకు కమలాపూర్ ఇన్స్పెక్టర్ హరికృష్ణ, యువజన సంఘం అధ్యక్షుడు బాలసాని కుమారస్వామి, యూత్ సభ్యులు బహుమతులు అందించారు. కార్యక్రమంలో ప్రముఖ కళాకారులు జక్కు కృష్ణమూర్తి, బూడిద సురేందర్, యూత్ వ్యవస్థాపక అధ్యక్షుడు పబ్బు సతీశ్, యూత్ గౌరవాధ్యక్షుడు బాలసాని దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.