జనగామ సెయింట్​పాల్స్​హై స్కూల్​లో...ఆకట్టుకున్న వైజ్ఞానిక ప్రదర్శనలు

జనగామ అర్బన్, వెలుగు: జనగామ సెయింట్​పాల్స్​హై స్కూల్​లో విద్యాశాఖ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మున్సిపల్ చైర్​పర్సన్ పోకల జమున, జిల్లా గ్రంథాలయ చైర్మన్​మారజోడు రాంబాబు, డీఈవో రమేశ్, ఇన్స్​ఫైర్ పరిశీలకులు పింటు హతి, స్కూల్​ప్రిన్సిపాల్​జోసెఫ్​మారియాతో కలిసి అడిషనల్​కలెక్టర్​పింకేశ్​కుమార్ చీఫ్​గెస్ట్​గా పాల్గొని ప్రారంభించారు.

ఈ సందర్భంగా అడిషనల్​కలెక్టర్​మాట్లాడుతూ విద్యార్థులను టీచర్లు ప్రోత్సహించి వారిలోని సృజనాత్మకతను వెలికితీయాలని కోరారు. ఈ ప్రదర్శనలో విద్యార్థులు 265 ప్రయోగాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్​అధికారి ఉపేందర్, డీసీఈబీ కార్యదర్శి చంద్రభాను, ఏసీజీఈ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.