ఖమ్మంలో ఆకట్టుకున్నసైన్స్ ఫెయిర్​ 

ఖమ్మం టౌన్/ఫొటోగ్రాఫర్​ , వెలుగు : ఖమ్మం బల్లేపల్లి లోని ఎస్ఎఫ్ఎస్ పాఠశాలలో  విక్రమ్ సారాబాయ్ సైన్స్ ప్రాంగణంలో రెండు రోజులపాటు జరిగే జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక , ఇన్​స్పైర్​  ప్రదర్శనలు సోమవారం  ప్రారంభమయ్యాయి.   ముఖ్యఅతిథిగా    అడిషనల్​ కలెక్టర్​ శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.  ప్రతి విద్యార్థి ప్రశ్నించే గుణాన్ని పెంపొందించుకొని, సైంటిఫిక్​గా ఆలోచించాలని సూచించారు.  ఆదిమానవుల నుంచి నేటి వరకు అన్ని ఆవిష్కరణలకు సైన్స్  కారణం అన్నారు.  

అనంతరం మానవ ప్రగతికి కారణమైన చక్రం, నిప్పు, ఇంజన్  మొదలైన అంశాలతో  మేడసాని శేషగిరిరావు రచించిన పాటకు విద్యార్థుల డ్యాన్స్​ బాగుందని అభినందించారు. ఈ ప్రదర్శనలో వివిధ పాఠశాల నుంచి వచ్చిన విద్యార్థులు 530 ఎక్జిబిట్ లు , 119 ఇన్​స్పైర్​ ఎగ్జిబిట్లను ప్రదర్శించారు.  ఈ కార్యక్రమంలో  మేయర్ పునుకొల్లు నీరజ డీఈఓ  సోమశేఖర శర్మ ,   అర్బన్ మండల విద్యాధికారి కేవీ శైలజా లక్ష్మి పాల్గొన్నారు.