సిటీలో ట్రాన్స్ మిషన్ వ్యవస్థను మెరుగుపరచండి: సీఎండీ ముషారఫ్ ఫరూఖీ

సిటీలో ట్రాన్స్ మిషన్ వ్యవస్థను మెరుగుపరచండి: సీఎండీ ముషారఫ్ ఫరూఖీ

హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలో రానున్న వేసవిలో అధిక విద్యుత్ డిమాండ్‌‌ను తట్టుకునేలా పంపిణీ, ట్రాన్స్ మిషన్ వ్యవస్థను మెరుగుపర్చాలని దక్షిణ తెలంగాణ విద్యుత్‌‌ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ అధికారులకు సూచించారు. మింట్ కాంపౌండ్​లోని సంస్థ హెడ్​ఆఫీస్​లో ట్రాన్స్ కో డైరెక్టర్ జగత్ రెడ్డి, ఇతర ఇంజినీర్లతో గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఏటా వేసవిలో గ్రేటర్​పరిధిలో విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో నమోదవుతుందన్నారు.

శివారు ప్రాంతాలైన నెమలి నగర్, గోపన్ పల్లి, కోకాపేట్, కోహెడ, తట్టి అన్నారం, అబ్దుల్లాపూర్ మెట్, మాన్సాన్ పల్లి, అజిజ్ నగర్, కందుకూరు, కే సింగారం, మల్లాపూర్, వాయుపురి, ఉప్పల్ భగాయత్, దుండిగల్ వంటి ప్రాంతాల్లో డిమాండ్ గణనీయంగా ఉందన్నారు. ఆయా ప్రాంతాల్లో అవసరానికి తగ్గట్టు 220/132/33 కేవీ సబ్ స్టేషన్స్ ఏర్పాటు, ఇతర నెట్​వర్క్ ను పటిష్టం చేయడానికి చర్యలు చేపట్టాలని సూచించారు. మరమ్మతు పనులను సంక్రాంతి లోపు పూర్తి చేయాలన్నారు.