మెరుగుపడ్డ సర్వీసెస్​ పీఎంఐ

మెరుగుపడ్డ సర్వీసెస్​ పీఎంఐ

న్యూఢిల్లీ: మనదేశంలో జులైలో  ఆర్థిక కార్యకలాపాలు విస్తరించాయి. సేవలలో పెరుగుదల,  తయారీ ఊపందుకోవడమే ఇందుకు కారణం. హెచ్​ఎస్​బీసీ హోల్డింగ్స్  ఫ్లాష్ సర్వే ప్రకారం.. సేవల కొనుగోలు మేనేజర్ల ఇండెక్స్ గత నెలలో 60.5 నుంచి 61.1కి పెరిగింది. అయితే తయారీ కొనుగోలు మేనేజర్ల ఇండెక్స్ జూన్​లో 58.3 నుంచి 58.5కి కొద్దిగా పెరిగింది.  ఇది కాంపోజిట్​పీఎంఐని మునుపటి నెల 60.9 నుంచి మూడు నెలల గరిష్ట స్థాయి 61.4కి తీసుకువెళ్లింది. పీఎంఐ 50 కంటే ఎక్కువ ఉంటే విస్తరణను సూచిస్తుంది.