క్రికెట్ లో తీవ్ర విషాదం నెలకొంది. ఇమ్రాన్ పటేల్ అనే ఆటగాడు క్రికెట్ మ్యాచ్ ఆడుతూ గుండెపోటుతో మరణించాడు. గురువారం(నవంబర్ 28) గార్వేర్ స్టేడియంలో ఈ విచార ఘటన చోటు చేసుకుంది. 35 ఏళ్ల ఇమ్రాన్ పటేల్ ఓపెనింగ్ బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు. కాసేపు బ్యాటింగ్ కొనసాగించాక అసౌకర్యానికి గురయ్యాడు. ఈ విషయాన్ని అంపైర్ తో చెప్పగా.. అంపైర్ గ్రౌండ్ వదిలి వెళ్లేందుకు అనుమతి ఇచ్చాడు.
తిరిగి పెవిలియన్ బాట పట్టే క్రమంలో ఇమ్రాన్ గ్రౌండ్ లోనే కుప్పకూలిపోయాడు. మ్యాచ్ లైవ్ స్ట్రీమ్ అవుతుండగా ఈ ఘటన కెమెరాకు చిక్కింది. ఇమ్రాన్ కుప్పకూలిపోవడంతో మైదానంలో ఉన్న ఇతర ఆటగాళ్లు అతని వైపు పరుగులు తీశారు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. అతనిని వైద్యులు పరిశీలించి చనిపోయినట్టుగా తెలిపారు. ఇమ్రాన్ చాలా మంచి ఆరోగ్యంతో ఉన్నప్పటికీ అతనికి ఇలా జరగడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇమ్రాన్‌కు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారిలో చిన్న కుమార్తె నాలుగు నెలల వయస్సు మాత్రమే.
A young man, Imran Sikandar Patel, died of a #heartattack while playing cricket in the Chhatrapati Sambhaji Nagar district of Maharashtra.https://t.co/aCciWMuz8Y pic.twitter.com/pwybSRKSsa
— Dee (@DeeEternalOpt) November 28, 2024