టీ20 క్రికెట్లో చరిత్ర సృష్టించిన ఇమ్రాన్ తాహిర్

టీ20 క్రికెట్లో చరిత్ర సృష్టించిన ఇమ్రాన్ తాహిర్

టీ20 క్రికెట్ లో దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ 500వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు.. ఈ ఘనత సాధించిన నాలుగో  బౌలర్ గా నిలిచాడు. ఫిబ్రవరి 13న  బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బిపిఎల్)లో రంగ్‌పూర్ రైడర్స్ , ఖుల్నా టైగర్స్ జట్ల మధ్య జరిగిన పోరులో 5 వికెట్లు తీసి ఈ ఈ ఫీట్ ను అందుకున్నాడు. తాహిర్ 44 ఏళ్ల వయసులోనే ఈ ఘనత సాధించాడు. 

ALSO READ :- భద్రాద్రికొత్తగూడెంలో పట్టుబడ్డ గంజాయిని దహనం చేసిన పోలీసులు

 అంతకంటే ముందుగా టీ20 ఫార్మాట్‌లో 500 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా వెస్టిండీస్ దిగ్గజ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో నిలిచాడు. బ్రావో టీ20 ఫార్మాట్‌లో 571 మ్యాచ్‌లు ఆడి 624 వికెట్లతో టాప్ ప్లేస్ లో నిలిచాడు. ఇక రషీద్ ఖాన్ రెండో స్థానంలో ఉండగా..  కరీబియన్ బౌలర్ సునీల్ నరైన్ మూడో స్థానంలో ఉన్నాడు. అంటే రషీద్ తర్వాత అతి తక్కువ ఫార్మాట్‌లో 500 వికెట్లు తీసిన రెండో లెగ్ స్పిన్నర్  కావడం విశేషం.