1990 లో కేజీ బంగారంతో మారుతి 800 వచ్చేది.. ఇప్పుడు అయితే ఏం కొనొచ్చో తెలుసా.. అదే 2040 అయితే..!

1990 లో కేజీ బంగారంతో మారుతి 800 వచ్చేది.. ఇప్పుడు అయితే ఏం కొనొచ్చో తెలుసా.. అదే 2040 అయితే..!

బంగారం అంటే భారత్.. భారత్ అంటే బంగారం.. అంతలా ఇండియన్ కల్చర్ లో భాగం అయిపోయింది గోల్డ్. ప్రతి ఇంట్లో ఆడవాళ్లు ఎంతో కొంత బంగారాన్ని ఆభరణాలుగా వినియోగిస్తుంటారు. కొందరు పెట్టుబడికి కూడా గోల్డ్ సింపుల్ థింగ్ అని భావిస్తుంటారు. రియల్ ఎస్టేట్, వ్యాపారం లాంటివి చేయలేని వాళ్లు.. మ్యుచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు మొదలైన పెట్టుబడి పద్ధతుల గురించి తెలియని సామాన్యులు సైతం గోల్డ్ సింపుల్ ఇన్వెస్ట్ మెంట్ గా భావిస్తారు. ఉన్న డబ్బుతో ఎంతో కొంత కొనిపెడితే భవిష్యత్తులో నాలుగు రాళ్లు వెనకేసుకోవచ్చునని బంగారంలో పెట్టుబడులు పెడుతుంటారు. 

ప్రస్తుతం శుక్రవారం  (మార్చి 21న) ఇండియాలో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్  ధర రూ.90,220 కి చేరుకుంది. గురువారం రూ.90,660 గా ఉంది. అదే 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు 82,910 రూపాయలుగా ఉంది. గురువారం రూ. 83,100 ల వద్ద ట్రేడ్ అవుతోంది.

గోల్డ్ నిత్యం వరుసగా పెరుగుతూ లాభాలు ఇస్తూ వస్తూనే ఉంది. అయితే 1990లో గోల్డ్ విలువ.. ఇప్పుడు దాని విలువను పోల్చితే ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే అప్పడున్న విలువకు.. ఇప్పుడున్న విలువకు.. ఫ్యూచర్ వ్యాల్యూకు ఎంత తేడా ఉందో చెప్పెయొచ్చు. 

ALSO READ | స్మార్ట్ టీవీలపై IPL బంపరాఫర్స్: రూ.20 నుంచి రూ.60 వేల వరకు భారీ డిస్కౌంట్స్..!

సెబీ (SEBI) రీసర్చ్ ఎనలిస్ట్ ఏకే.మంధన్ బంగారం పెట్టుబడులు.. లాభాలపై ఆసక్తికరమైన లెక్కలు చూపించాడు. 1990 లో ఒక కేజీ బంగారం విలువ అప్పటి మారుతి 800 (Maruti 800) కు సమానంగా ఉండేదట. అదే 2000 సంవత్సరంలో కేజీ గోల్డ్ తో మారుతీ ఎస్టీమ్ (Maruti Esteem) కు సమానమైన విలువ కలిగి ఉండేదట. ఇక 2005లో టయోటా ఇన్నోవా (Tata Innova) వచ్చేదంట ఆ టైమ్ లో. ఇక 2010లో కేజీ బంగారం అమ్మితే ఫోర్డ్ ఫార్చునర్ (Ford Fortuner) వెహికిల్ వచ్చేదట. అయితే 2019 కి వచ్చే సరికి బంగారం విలువ బీయండబ్లూ ఎక్స్1 (BMW X1) కు సమానం అయిపోయింది. దీన్ని బట్టి చూస్తే బంగారం విలువ ఎంత వేగంగా.. ఎంతగా పెరిగి పోతుందో అర్థమవుతుంది. 

 అంటే కేజీ బంగారం మన చేతులలో ఉంటే ఆయా కాలాలలో అప్పుడున్న బ్రాండ్, టాప్ మోస్ట్ బ్రాండ్స్ కార్లను కొనేయొచ్చు అన్నమాట. మరి ఇప్పుడే ఇలా ఉంటే.. 2024 కి ఎలా ఉంటుందో ఆలోచించండి. అప్పటి వరకు కేజీ బంగారం చేతిలో ఉంటే ఏకంగా జెట్ విమానాన్నే కొనొచ్చునని అంచనా వేశాడు ఏకే మంధన్. అంటే పెట్టుబడికి బంగారం ఎంత విలువైనదో ఈ లెక్కల్లో విశ్లేషించారు.