రూ. 2.01 లక్షల కోట్ల జీఎస్టీ ఎగ్గొట్టిన్రు:డీజీజీఐ

రూ. 2.01 లక్షల కోట్ల జీఎస్టీ ఎగ్గొట్టిన్రు:డీజీజీఐ

న్యూఢిల్లీ:2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ. 2.01 లక్షల కోట్ల జీఎస్టీ ఎగవేతకు సంబంధించిన 6,084 కేసులను ఇన్వెస్టిగేషన్ విభాగం డీజీజీఐ గుర్తించింది. ఆన్‌‌‌‌లైన్ గేమింగ్, బీఎఫ్​ఎస్​ఐ సేవలు,  ఐరన్, కాపర్, స్క్రాప్ రంగాల్లో  ఎగవేతలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. 

2022–23లో 4,872 కేసుల్లో కనుగొన్న రూ. 1.01 లక్షల కోట్ల కంటే ఈ మొత్తం రెట్టింపు.  వీటిలో స్వచ్ఛంద పన్నుల చెల్లింపులు 2022-23లో రూ.20,713 కోట్ల నుంచి 2023-24 లో రూ.26,605 కోట్లకు పెరిగాయి.  

 డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) వార్షిక నివేదిక ప్రకారం, పన్ను చెల్లించకపోవడానికి సంబంధించిన ఎగవేత కేసుల్లో 46 శాతం రహస్య సరఫరా, వాల్యూ తక్కువ చూపడం వంటివి ఉన్నాయి. 

20 శాతం కేసులు నకిలీ ఇన్‌‌‌‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ)కి సంబంధించినవి ఉన్నాయి.19 శాతం కేసులు ఐటీసీ అక్రమంగా పొందడం/ రివర్సల్  చేయకపోవడం వంటివి ఉన్నాయి.  2023-24లో ఆన్‌‌‌‌లైన్ గేమింగ్ రంగానికి చెందిన 78 కేసుల్లో గరిష్టంగా రూ. 81,875 కోట్ల ఎగవేత జరిగింది.