- రెండో ప్లేస్‌లో అజీమ్ ప్రేమ్‌జీ
ముంబై : సంపాదనలో ఎక్కువ భాగం దానాలిచ్చే లిస్టులో 2023 లోనూ హెచ్‌సీఎల్ శివ్‌నాడార్ తన టాప్ పొజిషన్‌ను నిలబెట్టుకున్నారు. ఈ ఏడాదిలో ఆయన ఇచ్చిన డొనేషన్స్ 76 శాతం పెరిగి రూ. 2,042 కోట్లకు చేరాయని ఎడెల్‌గివ్ హురున్ రిపోర్టు వెల్లడించింది. విప్రో బాస్ అజీమ్ ప్రేమ్‌జీ ఇచ్చిన డొనేషన్లు 2023 లో ఏకంగా 267 శాతం పెరిగాయి. దీంతో జాబితాలో ఆయన రెండో ప్లేస్‌లో నిలిచారు.
ఇండియాలోనే అత్యంత ధనికుడైన ముకేశ్ అంబానీ దానాలు 2023 లో 8 శాతం తగ్గిపోయి రూ. 376 కోట్లకు పరిమితమయ్యాయి. దేశంలో రెండో సంపన్న వ్యక్తి గౌతమ్ అదానీ డొనేషన్లు 50 శాతం పెరిగి రూ. 285 కోట్లవడంతో, ఆయన లిస్టులో అయిదో ప్లేస్ సంపాదించుకున్నారు. రూ. 287 కోట్ల దానంతో కుమార మంగళం బిర్లా లిస్టులో తన నాలుగో ప్లేస్‌ను నిలబెట్టుకున్నట్లు ఎడెల్‌గివ్ హురున్ రిపోర్టు తెలిపింది.
బజాజ్ ఫ్యామిలీ, సైరస్ పూనవాలా, రోహినీ నీలెకని ఫ్యామిలీలు కూడా టాప్10 జాబితాలోకి చేరినట్లు పేర్కొంది. జెరోధా బ్రదర్స్ ఇద్దరూ కలిపి రూ. 110 కోట్ల దానం ఇచ్చి, ఈ జాబితాలో యెంగెస్ట్గా నిలిచారని తెలిపింది.