‘రింకు లావణ్య’ పేరుతో చాట్ చేసి రూ. 16 లక్షలు కొట్టేశారు.. హైదరాబాద్‌లో ఉంటూ ఎంత పనిచేశారు..?

‘రింకు లావణ్య’ పేరుతో చాట్ చేసి రూ. 16 లక్షలు కొట్టేశారు.. హైదరాబాద్‌లో ఉంటూ ఎంత పనిచేశారు..?

ఖమ్మం, వెలుగు: సోషల్‌ మీడియాలో లింక్‌ పంపి, చాటింగ్‌ చేస్తూ నమ్మించి రూ. 16 లక్షలు వసూలు చేసిన ఇద్దరిని ఖమ్మం సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను ఆదివారం వెల్లడించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కేసారానికి చెందిన సరిపల్లి శ్రీకాంత్‌, ఏపీలోని విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం నాయుడుతోటకు చెందిన వంకర లావణ్య హైదరాబాద్‌లో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిద్దరికీ ఓ ప్రైవేట్‌ కోచింగ్‌ సెంటర్‌లో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ జల్సాలకు అలవాటు పడి తక్కువ టైంలో ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ప్లాన్‌ చేశారు.

ఇందులో భాగంగా లావణ్య ‘రింకు లావణ్య’ పేరుతో ఫేస్‌‌బుక్‌లో అకౌంట్‌ ఓపెన్‌ చేసి యువకులకు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపేది. ఈ క్రమంలో ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన ఓ వ్యక్తి లావణ్య ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్‌ చేయడంతో కొన్ని రోజుల పాటు చాటింగ్‌ చేసుకున్నారు. తర్వాత ఫోన్‌ నంబర్లు తీసుకొని వాట్సప్‌‌‌లోనూ చాటింగ్‌ మొదలుపెట్టారు. ఈ క్రమంలో తనకు డబ్బులు అవసరం ఉన్నాయని లావణ్య అడగడంతో సదరు వ్యక్తి ఆన్‌‌‌లైన్‌ ద్వారా ట్రాన్స్‌ఫర్‌ చేశాడు.

తర్వాత తన తల్లికి ఆరోగ్యం బాలేదని, ఇతర కారణాలు చెబుతూ డబ్బులు అడగడంతో విడతల వారీగా రూ. 16.05 లక్షలు పంపించాడు. కొంతకాలం తర్వాత డబ్బులు తిరిగి ఇవ్వాలని సదరు యువకుడు అగడంతో శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి వచ్చాడు. తన చెల్లిని ఎందుకు వేధిస్తున్నావని, లావణ్యతో చేసిన చాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మాటలు అన్నీ రికార్డు చేశామని, ఫొటోలను మార్ఫింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియాలో పోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తామని బెదిరించారు. తర్వాత కూడా డబ్బుల కోసం వేధిస్తుండడంతో బాధితుడు 

ఆగస్టు 28న ఖమ్మం సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ ప్రారంభించిన పోలీసులు ఈ నెల 19న విశాఖపట్నంలో శ్రీకాంత్, లావణ్యను అరెస్ట్ చేశారు. అక్కడి కోర్టులో హాజరుపరిచిన తర్వాత ట్రాన్సిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వారెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఖమ్మం తీసుకోచ్చారు. నిందితులను పట్టుకున్న సైబర్‌ క్రైమ్‌ డీఎస్పీ ఫణీందర్‌, ఎస్సై రంజిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కానిస్టేబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శ్రీనివాసరావు, కానిస్టేబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాగేశ్వరరావును సీపీ సునీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అభినందించారు.

ఓటీపీ తెలుసుకొని అకౌంట్‌ ఖాళీ చేసిన్రు
గంగాధర, వెలుగు : సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేరగాళ్లు ఓ వ్యక్తికి ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి, ఓటీపీలు తెలుసుకొని అతడి అకౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న రూ. 10 లక్షలను ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నమిలికొండ గ్రామానికి చెందిన ముత్యాల శ్రీనివాస్‌ గంగాధర మండలం మధురానగర్‌ చౌరస్తాలో హెయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహిస్తున్నాడు. తన యూనియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏటీఎం కార్డు పోవడంతో, కొత్త కార్డుతీసుకునేందుకు ఈ నెల 5న బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లాడు. అక్కడ కార్డు కోసం అప్లికేషన్‌‌ తీసుకున్న బ్యాంక్‌ ఆఫీసర్లు, పాత కార్డును బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకోవాలని సూచించారు.

దీంతో శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్రీ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఫోన్‌ చేసి ఏటీఎం కార్డును బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు. అదే రోజు మధ్యాహ్నం బ్యాంకు టోల్​ ఫ్రీ నంబర్​ను పోలిన ఓ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి ‘మీరు ఏటీఎం కార్డు కోసం అప్లై చేసుకున్నారు.. మీ అడ్రస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫోన్‌‌కు వచ్చిన ఓటీపీలు చెప్పండి’ అని అడిగాడు. దీంతో బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లే ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి ఉంటారని భావించిన శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తన ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మూడు సార్లు వచ్చిన ఓటీపీలను చెప్పాడు. ఇటీవల బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లి తన అకౌంట్‌ స్టేట్‌‌మెంట్‌ చూసుకోగా అందులో ఉండాల్సిన రూ. 10 లక్షలు కనిపించలేదు. దీంతో ఓటీపీలు చెప్పడంతో సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేరగాళ్లే తన డబ్బులు కాజేసి ఉంటారన్న అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.