బర్డ్ ఫ్లూ: పెంపుడు జంతువులతో జాగ్రత్త.. ఇండియాలో తొలిసారి పిల్లికి సోకిన వైరస్.. ఎక్కడంటే..

బర్డ్ ఫ్లూ: పెంపుడు జంతువులతో జాగ్రత్త.. ఇండియాలో తొలిసారి పిల్లికి సోకిన వైరస్.. ఎక్కడంటే..

ఇండియాలో బర్డ్ ఫ్లూ వైరస్ భయపెడుతోంది. వైరస్ బారిన పడి లక్షల కోళ్లు చనిపోతున్నాయి. మరోవైపు భయంతో ప్రజలు చికెన్ తినటమే మానేశారు. అయితే బర్డ్ ఫ్లూ మనుషులకే కాకుండా జంతువులకు కూడా సోకుతోంది. తాజాగా ఇండియాలో పెంపుడు జంతువుకు వైరస్ సోకడంతో ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. 

మధ్యప్రదేశ్ లో పెంపుడు పిల్లికి బర్డ్ ఫ్లూ వైరస్ సోకడం కలకలం రేపింది. ఛింద్వారా జిల్లాలో బర్డ్ ఫ్లూ (ఎవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్- H5N1) లక్షణాలు పిల్లిలో కనిపించడంతో ఆందోళన మొదలైంది. పెంపుడు జంతువులలో అభివృద్ధి చెంది మనుషులకు సోకే ప్రమాదం ఉందనే ఆందోళన ఛింద్వారా ప్రజల్లో నెలకొంది. 

H5N1 వైరస్ పక్షులకు సంక్రమించేది అయినప్పటికీ.. పాలిచ్చే జంతువులలో కూడా పెరుగుతుంది. జంతువులలో మ్యుటేషన్ చెంది కోవిడ్-19 మాదిరిగా చివరికి ఇవి ప్యాండమిక్ గా మారే ప్రమాదం ఉంది’’ అని సైంటిస్టులు చెబుతున్నారు. 

ICAR-NIHSAD, కేంద్ర ఎనిమల్ హస్బెండరీ సైంటిస్టులు జనవరిలో ఛింద్వారా జిల్లాలో కేసులను గుర్తించారు. డిసెంబర్ లో బర్డ్ ఫ్లూ సోకి పిల్లులు చనిపోయినట్లు నిర్ధారించారు. H5N1 వర్గానికి చెందిన 2.3.2.1a వైరస్ లు ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా కోళ్లలో బర్డ్ ఫ్లూకి కారణమయ్యాయి. ఆ తర్వాత పిల్లులలో కూడా వ్యాప్తి చెందినట్లు గుర్తించారు. 

బర్డ్ ఫ్లూ సోకిన పిల్లులకు మూడు రోజుల్లోనే తీవ్ర జ్వరం, ఆకలి మందగించడం, మబ్బు లక్షణాలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. అయితే పిల్లులలో 27 రకాలుగా లక్షణాలను మార్చుకుని వృద్ధి చెందుతాయని తెలిపారు. ఇవి కోళ్లతోపాటు పక్షులు, పాలిచ్చే జంతువులు, మనుషులకు వ్యాప్తి చెందుతాయని, చెబుతున్నారు. 

అయితే మనుషులలో ఇన్ఫెక్షన్లు తక్కువగా వచ్చే అవకాశం ఉన్నప్పటికీ.. జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. మనిషి నుంచి మనిషికి సోకడం కూడా తక్కువేనని కానీ దాని లక్షణాలలో మార్పులు వస్తే అది కూడా జరగవచ్చని హెచ్చరిస్తున్నారు.