- సిటిజన్స్‌కు ఆరోగ్యం, ఆహ్లాదం పంచేలా ఉమ్టా ప్లాన్
- రూ.250 కోట్లతో 10 కి.మీ. మేర నిర్మించాలని ప్రతిపాదనలు
- ప్రభుత్వానికి డీపీఆర్‌ను పంపిన ఉమ్టా అధికారులు
- జీహెచ్ఎంసీ లేదా హెచ్ఎండీఏ లేదా టూరిజం శాఖ నిర్మించే చాన్స్
- పీపీపీ పద్ధతిలో నిర్మించాలనే యోచనలో సర్కార్
- ఈ ప్రాజెక్టు పూర్తయితే పర్యాటకంగా మరింత అభివృద్ధి
హైదరాబాద్‌సిటీ, వెలుగు:సిటీ నడిబొడ్డున ఉన్న హుస్సేన్సాగర్తీరాన్ని పర్యాటకంగా మరింత డెవలప్చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. నగరవాసులకు ఆరోగ్యంతోపాటు ఆహ్లాదం పంచేలా త్వరలో సరికొత్త ప్రాజెక్టును ప్లాన్చేసింది. హుస్సేన్‌సాగర్ చుట్టూ ఎలివేటెడ్సైకిల్, వాకింగ్ట్రాక్స్ నిర్మించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను హెచ్ఎండీఏలోని యూనిఫైడ్ మెట్రోపాలిటన్డెవలప్మెంట్అథారిటీ(ఉమ్టా) అధికారులు సిద్ధం చేశారు. డీపీఆర్ ను ప్రభుత్వానికి పంపారు.
ఈ ప్రాజెక్టు పూర్తయితే సాగర్తీరాన ట్రాఫిక్సమస్య తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పర్యాటకంగా మరింత అభివృద్ధి జరుగుతుందని అంటున్నారు. నార్సింగి వద్ద ఓఆర్ఆర్ ను ఆనుకుని నిర్మించిన సైకిల్ట్రాక్మాదిరిగానే ట్యాంక్బండ్వద్ద నిర్మాణం ఉంటుందన్నారు. టూరిస్టులను ఆకట్టుకునేలా ఏర్పాట్లు ఉండనున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే దేశంలోనే మొట్టమొదటి సారిగా లేక్చుట్టూ ఎలివేటెడ్సైకిల్, వాకింగ్ ట్రాక్ నిర్మించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుందని ఉమ్టా అధికారులు చెబుతున్నారు.
ఎన్టీఆర్గార్డెన్స్నుంచి మొదలు..
ఎలివేటెడ్సైకిల్, వాకింగ్ట్రాక్స్ ను ఎన్టీఆర్ గార్డెన్స్ నుంచి మొదలుకుని పీపుల్స్ ప్లాజా, జలవిహార్, సంజీవయ్య పార్కు, సెయిలింగ్‌క్లబ్, ఇందిపార్కు రూట్వరకు నిర్మిస్తారు. ఆయా చోట్ల ట్రాక్ పైకి వెళ్లేందుకు అనువుగా ర్యాంపులు నిర్మిస్తారు. ప్రతి ర్యాంపు వద్ద సైకిళ్లు అద్దెకు ఇచ్చేందుకు కౌంటర్లు పెడతారు. సైకిల్ట్రాక్పైకి ఏ ఇతర వెహికల్స్‌ను అనుమతించరు.
అలాగే వాకర్ల కోసం ప్రత్యేకంగా మరో ట్రాక్నిర్మిస్తారు. ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్, జాగింగ్ చేసేందుకు అవకాశం కల్పిస్తారు. ట్రాక్స్ పొడవునా అక్కడక్కడా ఫుడ్‌కోర్టులు, కాఫీ షాపులు ఏర్పాటు చేస్తారు. మొత్తం 10 కి.మీ. మేర ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించారు. రూ.250 కోట్ల వరకు ఖర్చు అవుతుందని ఉమ్టా మేనేజింగ్ డైరెక్టర్జీవన్ బాబు తెలిపారు.
సర్కారుకు భారీ ఆదాయం
ఎలివేటెడ్సైకిల్, వాకింగ్ట్రాక్స్నిర్మాణానికి సంబంధించిన డీపీఆర్‌ను సిద్ధం చేసి ఇప్పటికే ప్రభుత్వానికి పంపినట్లు ఉమ్టా అధికారులు తెలిపారు. హెచ్ఎండీఏ లేదా జీహెచ్ఎంసీ లేదా టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టును చేపట్టే అవకాశం ఉంది. ప్రభుత్వం పబ్లిక్ప్రైవేట్పార్టనర్షిప్(పీపీపీ) పద్ధతిలో నిర్మించాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ర్యాంపుల వద్ద సైకిళ్లు అద్దెకు ఇచ్చేందుకు ప్రభుత్వం కొన్ని కంపెనీలను ఎంపిక చేస్తుంది. ట్రాక్స్‌పైకి వెళ్లేందుకు కొంత ఫీజు వసూలు చేస్తుంది. ట్రాక్‌పైన అక్కడక్కడ ఫుడ్‌స్టాల్స్, కాఫీ షాపులు ఏర్పాటు ఇలా అన్ని విధాలా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. ఎలివేటెడ్ప్రాజెక్టు పూర్తయితే ట్యాంక్బండ్పరిసరాల్లో ట్రాఫిక్సమస్య తగ్గుతుందని, సందర్శకుల సంఖ్య భారీగా పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.