మేడ్చల్ మండలం పూడూరు గ్రామంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులపై ఉపాధ్యాయులు పైసాచికత్వం ప్రదర్శించారు. దసరా పండగ సెలువుల్లో ఇచ్చిన హోమ్ వర్క్ చేయలేదని చొక్కా ఇప్పించి, మోకాళ్లపై కూర్చోబెట్టి మరీ రాయించారు. మేడ్చల్ జిల్లాలోని పూడూరు గ్రామంలో సైంట్ మేరీ స్కూల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు దసరా సెలవుల్లో హోంవర్క్ పూర్తి చేయకపోవడంతో ఈ పనిష్మెంట్ ఇచ్చారు.
హోంవర్క్ పూర్తి చేయని విద్యార్థులను చొక్కాలు విప్పించి మోకాళ్లపై కూర్చోబెట్టిన మిగిలిన హోమ్ వర్క్ చేయించారు సైంట్ మేరీ స్కూల్ టీచర్లు. విద్యార్థులకు పనిష్మెంట్ ఇస్తున్న ఫొటోలు బయటకు వచ్చాయి. స్కూల్ యాజమాన్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ | అశోక్ నగర్లో ఉద్రిక్తత.. గ్రూప్ 1 అభ్యర్థులపై లాఠీచార్జ్