ఆన్ లైన్ యాప్‌‌లతో జాగ్రత్త : ఎస్పీ చందనా దీప్తి

నల్గొండ అర్బన్​, వెలుగు :  అధిక వడ్డీలకు ఆశపడి ఆన్ లైన్ యాప్‌‌లలో పెట్టుబడి పెట్టవద్దని ఎస్పీ చందనా దీప్తి బుధవారం ఓ ప్రకటనలో కోరారు.  సైబర్ నేరగాళ్లు టెక్నాలజీని ఆసరా చేసుకుని అమాయక ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. నకిలీ వెబ్ సైట్ల ద్వారా నమ్మించి డబ్బులు లాగేస్తారని, వైద్య సాయం, పేరుపొందిన కంపెనీల్లో ఉద్యోగాల పేరుతోనూ మోసాలు చేస్తారని చెప్పారు.  

లోన్ యాప్‌‌ల దర్వారా సులభంగా లోన్లు ఇస్తూ అధిక వడ్డీలు వసూలు చేయడమే కాదు డేటా తమ అధీనంలోకి తీసుకొని ఇబ్బందులు పెడతారని హెచ్చరించారు. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే లింకులు, మెసేజ్‌‌లు ఓపెన్‌‌ చేయవద్దని,  యాప్‌‌లు డౌన్‌‌లోడ్ చేసుకోవద్దని  సూచించారు. ఎవరైనా ఇలాంటి మోసాలకు గురైతే వెంటెనే  సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించాలని, హెల్ప్ లైన్ నంబర్ 1930 లేదా 155260 కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు.