సంభాల్: ఉత్తరప్రదేశ్ లో ఘోరం జరిగింది. బైక్పై వెళుతున్న వ్యక్తిని బీజేపీ స్టిక్కర్ ఉన్న బొలెరో వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్పై వెళుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయాడు. దాదాపు 2 కిలోమీటర్ల వరకూ బైక్ను బొలెరో వాహనం ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
— Sachin Gupta (@SachinGuptaUP) December 30, 2024
ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఆ బొలెరో వాహనంలో ఉన్న వాళ్లు అసలు మనుషులు కాదేమో.. నిప్పులు చిమ్ముతున్నా సరే పట్టించుకోకుండా ఆ బైక్ను ఈడ్చుకెళుతూ పైశాచిక ఆనందం పొందడం ఏంటని మండిపడుతున్నారు. ఒక మనిషి నిండు ప్రాణం తీసిన ఆ దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని సంభాల్లో ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొరదాబాద్కు చెందిన సుఖ్బీర్ ఆదివారం సాయంత్రం బస్లా గ్రామంలోని తన అత్తింటికి వెళ్లి తిరిగి తన స్వగ్రామం వెళుతున్నాడు. బైక్పై వెళుతున్న అతనిని వాజిద్పూర్ సమీపంలో అస్మోలి బైపాస్పై బీజేపీ స్టిక్కర్తో ఉన్న ఒక బొలెరో వాహనం ఢీ కొట్టింది. బైక్తో సహా అతనిని ఈడ్చుకెళ్లింది. కిలోమీటర్ వరకూ బొలెరో చక్రాల కింద నలిగిపోయిన బాధితుడు తీవ్ర గాయాలతో పక్కన పడిపోయాడు. అయినా సరే ఆ బొలెరో వాహనం ఆగలేదు. బైక్ను మరో కిలోమీటర్ వరకూ ఈడ్చుకెళ్లింది.
ALSO READ | 20 రోజుల కిందట అదృశ్యం.. ఆల్మండ్ నదిలో శవమై కనిపించిన భారత విద్యార్థిని
సంభాల్ జిల్లా ఆసుపత్రికి సుఖ్బీర్ ను తరలించి చికిత్సనందించారు. సోమవారం ఉదయం సుఖ్బీర్ చనిపోయాడు. ఆ బొలెరో నంబర్ ప్లేట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఇన్స్పెక్టర్ అంజు తోమర్ ఈ దుర్ఘటనపై స్పందిస్తూ.. నిందితులను కఠినంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకుంటామని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు. ఆ బొలెరో వాహనంపై బీజేపీ లోగోతో పాటు ‘‘గ్రామ్ ప్రధాన్’’ అని కూడా రాసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.