హైదరాబాద్ సిటీ, వెలుగు : నిర్ణయించిన చార్జ్కంటే అదనంగా రూ.80 టోల్ట్యాక్స్వసూలు చేసిన టోల్ఆపరేటర్గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌వే, హెచ్ఎండీఏ సంస్థలకు హైదరాబాద్జిల్లా కన్జ్యూమర్కమిషన్రూ.35వేలు ఫైన్విధించింది. రామాంతపూర్ కు చెందిన గుమ్మి రాజ్ కుమార్ గతేడాది నవంబర్11న రాత్రి కారులో ఘట్కేసర్వద్ద ఓఆర్ఆర్ఎక్కాడు. కీసర వద్ద ఎగ్జిట్అయ్యాడు. టోల్ట్యాక్స్కింద రూ.20 కట్‌అయింది.
రాజ్‌కుమార్5 గంటల లోపే తిరుగు ప్రయాణయ్యాడు. రిటర్న్‌లో మాత్రం టోల్ట్యాక్స్కింద రూ.90 కట్‌అయింది. అయితే 5 గంటల లోపు తిరిగి ఓఆర్ఆర్ఎక్కితే కేవలం రూ.10 చెల్లిస్తే చాలు. కానీ రూ.80 అదనంగా వసూలు చేశారు. ఇదేమిటని ఓఆర్ఆర్ టోల్ ఫ్రీ నంబర్14449కు కాల్ చేస్తే పనిచేయలేదు. ఫాస్ట్ ట్యాగ్ తో టై అప్ అయిన ఐడీఎఫ్సీ బ్యాంక్ కు మొబైల్ యాప్ ద్వారా కంప్లైంట్ చేస్తే రెస్సాన్స్రాలేదు.
విసిగిపోయిన రాజ్కుమార్హైదరాబాద్జిల్లా కన్జ్యూమర్కమిషన్ ను ఆశ్రయించాడు. తాజాగా టోల్ ఆపరేటర్ గోల్కొండ ఎక్స్ ప్రెస్ వే, హెచ్ఎండీఏ సంస్థలకు సంయుక్తంగా రూ.30 వేలు జరిమానా విధించింది. అలాగే కోర్టు ఖర్చుల కింద ఫిర్యాదుదారుడికి45 రోజుల్లో రూ.5 వేలు ఇవ్వాలని ఆదేశించింది.