
కాశీబుగ్గ, వెలుగు: వరంగల్ ఏనుమాముల అగ్రికల్చర్ మార్కెట్‌లో శుక్రవారం మక్కలకు రికార్డు స్థాయి ధర పలికింది. హనుమకొండ జిల్లా నర్సక్కపల్లి గ్రామానికి చెందిన సురావు కిషన్‌రావు అనే రైతు తీసుకొచ్చిన మక్కలను ఓ ప్రైవేట్ వ్యాపారి రూ.3016కు క్వింటాల్ చొప్పున కొనుగోలు చేశారు. ఏనుమాముల మార్కెట్‌లో ప్రభుత్వ ధర ప్రకారం క్వింటాల్ మక్కలు రూ. 2,090 పలుకుతున్నాయి. కానీ ప్రైవేట్ వ్యాపారి రికార్డు స్థాయిలో క్వింటాల్‌కు మూడు వేల రూపాయలకు పైగా ఇవ్వడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.