పాకిస్తాన్, తాలిబాన్ కాదు..ఇది ఇండియా:అనురాగ్ ఠాకూర్

పాకిస్తాన్, తాలిబాన్ కాదు..ఇది ఇండియా:అనురాగ్ ఠాకూర్
  • వక్ఫ్ బోర్డులో అవినీతిని అరికట్టడమే మా లక్ష్యం: అనురాగ్ ఠాకూర్

న్యూఢిల్లీ: లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభలో వక్ఫ్ (సవరణ) బిల్లుపై బుధవారం నాటి చర్చలో సందర్భంగా బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వక్ఫ్ వ్యవస్థలో అవినీతిని, అక్రమాలను పూర్తిగా అంతం చేయాలన్నారు. 

ఇది భారతదేశమని..పాకిస్తాన్ లేదా తాలిబన్ దేశం కాదని స్పష్టం చేశారు. మన దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే పనిచేస్తుందని.. మొఘలుల ఆదేశాలు కాదని స్పష్టం చేశారు. 

వక్ఫ్ (సవరణ) బిల్లు ద్వారా వక్ఫ్ బోర్డు ఆస్తుల నిర్వహణలో పారదర్శకతను తీసుకురావడం, అక్రమాలు, ఆక్రమణలను అరికట్టడం, వక్ఫ్ ఆస్తుల దుర్వినియోగాన్ని నివారించడం లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు.