ఆర్మూర్, వెలుగు: ఈనెల 17 నుంచి 19 వరకు వనపర్తిలో జరిగే రాష్ట్ర స్థాయి ఎస్జీఎఫ్అండర్–17 బాలబాలికల పోటీల్లో పాల్గొనే ఉమ్మడి జిల్లా జట్టును బుధవారం ఆర్మూర్ లో ఎంపిక చేశారు.
టౌన్ లోని మినీ స్టేడియంలో నిర్వహించిన పోటీల్లో ఉత్తమ ప్రతిభ చూపిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు పంపుతున్నట్లు జిల్లా ఎస్జీఎఫ్ సెక్రటరీ సంగీతరావు, జిల్లా హాకీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సదమస్తుల రమణ తెలిపారు. ఈ సందర్భంగా సంగీతరావు మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని జిల్లా జట్టు ప్రతీసారి విన్నర్‌గా నిలుస్తోందని, ఈసారి అదే రిపీట్కావాలన్నారు. కార్యక్రమంలో జిల్లా హాకీ సంఘం కోశాధికారి పింజ సురేందర్, హాకీ సంఘ సభ్యులు చిన్నయ్య, నాగేశ్, పీడీ, పీఈటీలు స్వామి, రాజేశ్, సురేశ్, రాజేశ్వర్, శ్రీకాంత్, కత్తి శ్రీనివాస్, ఆంజనేయులు, మీనా, సంతోష్ రెడ్డి, నాగరాజు పాల్గొన్నారు.