ఆస్ట్రేలియా ఓపెన్ 2025లో దిగ్గజ టెన్నిస్ ఆటగాడు జకోవిచ్ సెమీస్‌కు దూసుకెళ్లాడు. 2025, జనవరి 21వ తేదీన జరిగిన క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ యువ సంచలనం క్లారోస్ అల్కరాజ్ను చిత్తు చేశాడు. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచులో 4-6, 6-4, 6-3, 6-4 తేడాతో సెర్బియా ఆటగాడు అద్భుత విజయం సాధించాడు. తద్వారా 12వ సారి ఆస్ట్రేలియా ఓపెన్‌లో జకోవిచ్ సెమీ ఫైనల్‌కు చేరుకున్నాడు. ఇందులో 10 సార్లు ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్‌ను జకోవిచ్ గెలిశాడు.
మంగళవారం మెల్‌బోర్న్‌లోని రాడ్ లావర్ ఎరీనాలో జకోవిచ్, అల్కరాజ్ మధ్య ఆసక్తికర పోరు జరిగింది. గెలుపు కోసం ఇద్దరు హోరాహోరీగా తలపడ్డారు. ఈ మ్యాచులో యంగ్ ప్లేయర్ అల్కరాజ్ జకోను 6---4 తేడాతో తొలి రౌండ్లో ఓడించి గేమ్‌ను ఆత్మ విశ్వాసంతో ప్రారంభించాడు. ఫస్ట్ రౌండ్ అనంతరం జకోవిచ్ గాయపడ్డాడు. అయిన ఏ మాత్రం ధైర్యం కోల్పోకుండా మళ్లీ బరిలోకి దిగిన జకోవిచ్ అద్భుతంగా పుంజుకున్నాడు. ఫస్ట్ రౌండ్ నెగ్గి జోష్‌లో ఉన్న అల్కరాజ్ను ధీటుగా ఎదుర్కొని 6-4 తేడాతో రెండో రౌండ్‌ను దక్కించుకున్నాడు జకో.
చెరో రౌండ్ గెలిచి పోరు సమం కావడంతో జకో, అల్కరాజ్ హోరాహోరీగా తలపడ్డారు. తన అనుభవంతో యువ ప్లేయర్ అల్కరాజ్ను ఒత్తిడిలోకి నెట్టిన జకో 6-3, 6-4 తేడాతో వరుసగా 3, 4 రౌండ్లలో విజయం సాధించి మరో రౌండ్ మిగిలి ఉండగానే జోకోవిచ్ గెలుపు ఖాయం చేసుకున్నాడు. తొలి రౌండ్‌ను గెలుపుతో ఘనంగా ఆరంభించిన అల్కరాజ్.. జకో అనుభవం ముందు తలవంచక తప్పలేదు. మ్యాచులో చేసిన కొన్ని పొరపాట్ల వల్ల అల్కరాజ్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. దీంతో తొలిసారి ఆస్ట్రేలియా ఓపెన్ నెగ్గాలన్న అల్కరాజ్ కల ఈ సారి కూడా నెరవేరలేదు.
ALSO READ | Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ ప్లేయింగ్ 11లో అతడు ఉండాల్సిందే: అశ్విన్
జనవరి 23వ తేదీ గురువారం జరిగే సెమీ-ఫైనల్స్‌లో వరల్డ్ నెంబర్ టూ ప్లేయర్ అలెగ్జాండర్ జ్వెరెవ్‌తో జకో తలపడనున్నాడు. జోకోవిచ్ ప్రస్తుతం 24 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించి అత్యధిక టైటిల్స్ సాధించిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఈ ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ గెలిస్తే.. 25 వ్యక్తిగత గ్రాండ్ స్లామ్‌లను సాధించిన మొదటి టెన్నిస్ ఆటగాడిగా జోకోవిచ్ చరిత్ర సృష్టించనున్నాడు.