గుంట భూమికి కూడా సాగునీళ్లు రాలే : దినేశ్​కుమార్ ​కులాచారి

ఇందల్వాయి, వెలుగు: రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాజిరెడ్డి గోవర్ధన్​ రూరల్​ నియోజకవర్గంలో గుంట భూమికి కూడా సాగునీరు అందించలేదని బీజేపీ అభ్యర్థి దినేశ్​కుమార్ ​కులాచారి ఆరోపించారు. గురువారం ఆయన ఇందల్వాయి మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా దినేశ్​ మాట్లాడుతూ గత ఎన్నికల సందర్భంగా రెండేండ్లలో నియోజకవర్గంలోని భూములకు సాగునీరందిస్తానని, లేని పక్షంలో రాజీనామా చేస్తానని బాజిరెడ్డి హామీ ఇచ్చారని, అయిదేండ్లలోనూ నీరందించ లేకపోయారన్నారు.

ఇప్పుడు మళ్లీ ఓట్లడగడానికి వస్తున్నారన్నారు. భవిష్యత్​తరాలు బాగుండాలంటే బీజేపీకి ఓటేయాలన్నారు. గెలిచిన తర్వాత మూడు నెలలకు ఒకసారి ప్రతీ గ్రామానికి వెళ్లి ప్రజల సమస్యలను పరిష్కరిస్తానన్నారు. పార్లమెంట్​కన్వీనర్​ గద్దె భూమన్న, మండలాధ్యక్షుడు రాజన్న పాల్గొన్నారు.