Hilsa Fish: కిలో చేప రూ.3 వేలు..ఈ చేపలు ఎందుకింత స్పెషల్..?

Hilsa Fish: కిలో చేప రూ.3 వేలు..ఈ చేపలు ఎందుకింత స్పెషల్..?

చేపలంటే ఎవరికి ఇష్టం ఉండదూ.. రకరకాల చేపలను ఏరికోరి దగ్గరుండి వండించుకుని తింటుంటారు చేపప్రియులు. భారత దేశంలో చాలా రకాల చేపలు అందుబాటులో ఉంటాయి. నదులు, చెరువులు , సముద్ర చేపలు ఇలా ఎవరికి ఇష్టం ఉన్నది వారు చేప ఫ్రై, చేప పులుసు, చేప బిర్యానీ ఇలా తమకు నచ్చిన రీతిలో వండుకుని తింటుంటారు. అయితే ఈ చేపల్లో కొన్ని రకాలు చాలా ప్రత్యేకతను కలిగి ఉంటాయి. అరుదుగా సీజనల్ గా దొరికే ఈ చేపల ధర భారీగా ఉంటుంది. వేలం పాటలో వేలు, ఒక్కోసారి లక్షల్లో చెల్లించి వీటిని దక్కించుకుంటారు.  

ALSO READ | Good Health: వర్షాకాలం.. బెస్ట్​ ఫుడ్​ ఇదే..

ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ లో దొరికే పులుస చేప.. గోదావరి ఉప్పొంగుతున్నప్పుడు ఈ చేప ఎదురీతూ వస్తుంది. గోదావరి ఉధృతంగా ప్రవహించే సమయంలో మాత్రమే ఈ చేప దొరుకుతుంది. అలాగే చేప రకాల్లో ప్రత్యేకత ఉన్న మరో చేప హిల్సా చేప.. ఇది చాలా రుచిగా ఉంటుంది. పశ్చిమ బెంగాల్ లో దొరికే ఈ చేప ఇటీవల జాలర్ల వలకు చిక్కింది.. ఈ చేపనువేలం పాట వేస్తే.. కిలో వేలల్లో పలుకిందట.. ఈ చేప ప్రత్యేక ఏంటో తెలుసుకుందాం... 

 హిల్సా చేప.. గురువారం జూలై 25, 2024న పశ్చిమ బెంగాల్ లోని కాక్ ద్వీప్ మార్కెట్ కు చెందిన మత్స్య కారుల వలకు చిక్కింది. పశ్చిమ బెంగాల్ లోని సుందర్ బన్స్ ప్రాంతంలో ఈ చేపలు ఎక్కువగా దొరుకుతాయి. మురిగంగ నదిలో వేటకు వెళ్లిన కాక్ ద్వీప్ జాలర్లకు రెండు కిలోల హిల్సా చేప చిక్కింది. కాక్ ద్వీల్ లోని పాల్ బజార్ లో ఈ చేపను వేలం వేశారు. దీనికి కిలో రూ. 3వేలకు అమ్ముడు పోయింది. 2022,2023 సంవత్సరాల్లో కూడా ఇదే సీజన్ లో హిల్సా చేపలు జాలర్ల వలకు చిక్కాయి. అయితే అప్పుడు ఈ హిల్సా చేపల సైజు పెద్దగానే ఉంది.. ఒక్కో చేప దాదాపు మూడు కిలోలు తూకం వచ్చిందట. 

అంతేకాకుండా జూన్ 13, 2024న దిఘా వాగు  ప్రాంతంలో లభించిన మరో ప్రత్యేకమైన భారీ చేప కైభోలా ను రూ. 51వేలకు విక్రయించారు. వర్షాకాలంలో చేపలు పట్టే సమయంలో ఈ రకమైన చేపలు మత్స్య కారుల ట్రాలర్లలోకి వస్తాయి. ఈ ఏడాది అతిపెద్ద చేప కైభోలా మొదటగా దిఘా వాగులో కనిపించింది. పలువురు మత్స్య కారులు మాట్లాడుతూ ఈ చేపలు పెద్దగా ఖరీదు చేయకపోయినా... మార్కెట్లో స్థానిక వ్యాపారులు, మత్స్యకారుల దృష్టిని ఈ చేపలు ఆకర్షించాయని చెబుతున్నారు.