ఇన్ఫోసిస్..ఈ పేరు వింటే టాప్ ఐటీ కంపెనీ..ఇదే గుర్తుకొస్తుంది..అందులో ఉద్యోగం అంటే స్టార్టింగ్ లక్షల్లో జీతం..అలాంటి ఇన్ఫోసిస్ కంపెనీలో టాప్ ఎగ్జిక్యూటివ్ అంటే ఎంత పెద్ద జీతం ఉంటుంది..ప్రపంచానికే అతను టెక్నాలజీ అందించే స్థాయిలో ఉన్నారు..అలాంటి ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ సైబర్ నేరగాళ్ల చేతిలో ఘోరంగా మోసపోయారు.. ఏకంగా 3 కోట్ల 70 లక్షల రూపాయ లను స్వయంగా తానే సైబర్ కేటుగాళ్లకు డబ్బులు పంపించటం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది..అసలు సైబర్ క్రిమినల్స్ ఎలా బుట్టలో వేశారు అనటానికి పెద్ద సినిమా కథనే నడిచింది.. స్క్రీన్ ప్లే నడిచింది.. అది ఎలాగో చూద్దాం..
- నవంబర్ 21వ తేదీన ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ కు కాల్ వచ్చింది.
- ట్రాయ్ ఉద్యోగి అని చెప్పాడు.. ముంబై నుంచి కాల్ చేస్తున్నట్లు చెప్పాడు..
- ఆ తర్వాత పోలీసులు సీన్ లోకి వచ్చారు..
- పోలీస్ స్టేషన్ సెట్ వేశారు..ఖాకీ డ్రస్ లో ఉన్నారు.. ఐడీ కార్డులు చూపించారు ఆన్లైన్లోనే..
- కేసు నమోదైనట్లు సెక్షన్లు.. వాటి వివరాలు.. FIR కాపీ కూడా చూపించారు..
- ఆ తర్వాత సీబీఐ వాళ్లు వస్తారని చెప్పారు..
- భయపడిన ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ 3 రోజుల్లో 3 కోట్ల రూపాయలను వాళ్లు చెప్పిన బ్యాంక్ ఖాతాలకు పంపించాడు.
- తీరా చూస్తే అన్నీ ఫేక్.. పోలీస్స్టేషన్ కూడా ఫేక్ ..సెట్ చేశారు..
- నవంబర్ 25న బెంగళూరులో పోలీస్ కంప్లయింట్ అయ్యింది..
- పోలీసులు సైతం మైండ్ పోయింది..ఇలాంటి తరహా చీటింగ్ ప్రపంచంలోనే ఫస్ట్ టైం అంటున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు.
ఇన్ఫోసిస్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోగొట్టుకున్న నగదు రూ. 3కోట్లకంటే ఎక్కువగా ఉన్నందున సీబీఐకి అప్పగిస్తామని చెప్పారు. దర్యాప్తులో భాగంగా నగదు బదిలీ అయిన ఖాతాలను ఫ్రీజ్ చేయాలని బ్యాంకు అధికారులను కోరినట్లు తెలిపారు.
సాధారణ వ్యక్తుల నుంచి వైట్ కాలర్ ఉద్యోగుల వరకు అన్ని స్థాయిల్లో వారిని సైబర్ నేరగాళ్లు మోసం చేస్తున్నారు. డేటా స్టీలింగ్, బెదిరింపులకు పాల్పడుతూ బ్యాంకుఖాతాలు ఖాళీ చేస్తున్నారు.. అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్ హెచ్చరిస్తోంది. అనుమానాస్పద వ్యక్తులనుంచి కాల్స్ వస్తే వెంటనే సైబర్ క్రైంలో ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.
Also Read :-మాఫియానా వీడు : అతని ఫోన్ లో 13 వేల నగ్న ఫొటోలు