భద్రాచలం సీతారాముల కల్యాణ వైభోగమే!

 భద్రాచలం, వెలుగు : సీతారామచంద్రస్వామి దేవస్థానంలో గురువారం సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. కర్నాటక రాష్ట్రం తిరునారాయణపురం మేల్కోట దివ్యదేశం యదుగిరి యతిరాజ మఠం నారాయణ జీయర్​ స్వామీజీ సీతారాముల దర్శనం అనంతరం నిత్య కల్యాణంలో పాల్గొన్నారు. ఆయనకు దేవస్థానం అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. గర్భగుడిలో ప్రత్యేక పూజలు అనంతరం లక్ష్మీతాయారు అమ్మవారి సన్నిధిలో ఆయనకు వేదాశీర్వచనం ఇచ్చి ప్రసాదం, జ్ఞాపికలను అందజేశారు.

ఈ సందర్భంగా బేడా మండపంలో నిత్య కల్యాణం జరగ్గా భక్తులతో పాటు నారాయణ జీయర్​స్వామీజీ కూడా పాల్గొన్నారు. విశ్వక్షేన పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగల్యధారణ, తలంబ్రాల వేడుక అనంతరం మంత్రపుష్పం సమర్పించాక క్రతువు ముగిసింది. భక్తులకు తీర్థగోష్టి నిర్వహించారు. మాధ్యాహ్నిక ఆరాధన తర్వాత సాయంత్రం దర్బారుసేవ జరిగింది. ‌‌