వెహికల్స్ పై వెళ్లేటప్పుడు జాగ్రత్తగా వెళ్లాలి.. నిబంధనలు పాటించి.. వాహనాలు నడపాలని అధికారులు పదే పదే చెబుతున్నా.. కొంతమందికి మాత్రం అవేవీ ఎక్కడం లేదు. రూల్స్ బ్రేక్స్ చేసి మరి వాహనాలు నడుపుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ వ్యక్తి... ఏడుగురు చిన్నారులను ఎక్కించుకుని స్కూటి నడిపాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
భద్రాద్రి కొత్తగూడం జిల్లా పాల్వంచలో ఓ యువకుడు స్కూటిపై ఏడుగురు చిన్నారులను కూర్చోబెట్టుకుని వెళ్తుండడం చాలామంది గమనించారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వీడియో తీయడంతో ఈ విషయం బయటపడింది. ఏడుగురు పిల్లలను బండిపై కూర్చోబెట్టుకుని నడిపిస్తున్న సమయంలో ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే అప్పుడు పరిస్థితి ఏంటని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటేనే మిగతావారిలో మార్పు వస్తుందంటున్నారు నెటిజన్లు.
ALSO READ :Telangana Travel : ఈ వీకెండ్ జగిత్యాల అందాలు చూసొద్దామా..
ఏడుగురు చిన్నారులను కూర్చొబెట్టుకుని TS28N 7379 వాహనాన్ని ప్రమాదకరంగా నడిపిన వ్యక్తి పేరు కుమ్మరి కుంట్ల నాగేశ్వరరావు అని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. నాగేశ్వరరావుపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.