బీహార్ ఎన్నికల్లో .. క్రిమినల్స్..గ్యాంగ్​స్టర్స్

బీహార్​లో ​క్రైం–రాజకీయాలు లింకయిపోయాయి. ఎలక్టోరల్​ సిస్టమ్​ను క్లీన్​గా ఉంచే ఉద్దేశంతో క్రిమినల్​ బ్యాక్​గ్రౌండ్​ ఉన్న వాళ్లు ఎన్నికల్లో పోటీ చేయకుండా చూడాలని సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే.. దానిని చాలా మంది బీహార్​ నాయకులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. తమ భార్య, పిల్లలు, లేదా కుటుంబ సభ్యులకు టికెట్లు ఇప్పించుకుని రాజకీయం చేస్తున్నారు. క్రిమినల్స్, రౌడీ షీటర్లు, గ్యాంగ్​స్టర్లు కూడా ఇదే పద్ధతి ఫాలో అవుతున్నారు. ఒక పార్టీ అని కాదు.. అన్ని పార్టీల్లోనూ ఇదే పరిస్థితి ఉంది.

బిహార్​ ఎన్నికల్లో క్రిమినల్​ బ్యాక్​గ్రౌండ్​ ఉన్న లోకల్​ లీడర్లదే రాజ్యం. పార్టీ కేడర్.. బాహుబలులుగా పిలుచుకునే వీరంతా ఈసారి ఎన్నికల్లో తమ ప్రభావం చూపించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తాము నేరుగా బరిలోకి దిగకుండా ఎక్కువ మంది తమ భార్యలను రంగంలోకి దించుతున్నారు. పార్టీల టికెట్ల లిస్టును చూస్తే ఈ విషయం వెల్లడవుతుంది. రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) ఫస్ట్​ లిస్ట్ లో 20 మంది క్యాండిడేట్లు ఇలాంటి వారే. ఇక జనతా దళ్​ యునైటెడ్(జేడీయూ) కూడా 40 మందికి టికెట్లు ఇచ్చింది. క్రిమినల్​ రికార్డు ఉండి రాజకీయ నాయకులుగా మారుతున్న వారు ఎన్నికల్లో పోటీ విషయానికి వచ్చేసరికి తామే నేరుగా పోటీ చేయడమో లేక తమ కుటుంబ సభ్యులను బరిలోకి దించడమో చేస్తున్నారు. వీరు నేరుగా పోటీ చేసినా.. చేయకపోయినా వారి ఆశీస్సులు అభ్యర్థుల భవిష్యత్​ను మార్చేస్తున్నాయి. వారి కుటుంబ సభ్యులు బరిలోకి దింపి చాలా మంది తమ కండ బలాన్నే నమ్ముకుంటున్నారు.

మనీ, మ్యాన్​పవర్

ఎలక్షన్లను సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్​ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఏదో ఒక రూపంలో మనీ, మ్యాన్​ పవర్ ప్రభావం చూపిస్తూనే ఉంది. ఎన్నికల్లో గెలుపే ప్రధానం కావడంతో దానికి చాలా మంది నాయకులు ఏమైనా చేసేందుకు వెనుకాడటం లేదు. రాజకీయ పార్టీలు కూడా డబ్బును వెదజల్లే వారికి, కండ బలం ఉన్న వారికే ఎక్కువ ఇంపార్టెన్స్​ ఇస్తున్నాయి. క్రిమినల్​ రికార్డు ఉన్న వారికి సీట్లు ఇచ్చే విషయంలో ఆర్జేడీ ముందుంది. జేడీయూ ఈ విషయంలో కాస్త మెరుగ్గానే ఉంది. కానీ ఈ రెండు పార్టీలు టికెట్లు ఇచ్చిన వారిలో మర్డర్, కిడ్నాప్, దోపిడీ లాంటి తీవ్ర నేరాలకు పాల్పడినవారు కూడా ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో ఆర్జేడీ బాహుబలులుగా పేరున్న నాయకుల భార్యలకు టికెట్లు ఇచ్చింది. అలాగే పార్టీ వెటరన్​ నాయకుల పిల్లలకు కూడా సీట్లు కేటాయించింది. రెండేండ్ల క్రితం ఓ మైనర్​పై అత్యాచారానికి పాల్పడినట్టు రాజ్​వల్లభ్​ యాదవ్​ ఆరోపణలు ఎదుర్కొన్నారు. అతని భార్య విభా దేవికి నవాడా అసెంబ్లీ సీటును ఆర్జేడీ ఇచ్చింది. 2019 లోక్​సభ ఎన్నికల్లోనూ ఆర్జేడీ టికెట్​పై పోటీ చేసిన ఆమె ఓటమిపాలైంది. రేప్, మర్డర్​ కేసులో దోషిగా తేలడంతో రాజ్​వల్లభ్​ యాదవ్​ ఎమ్మెల్యే సభ్యత్వం రద్దయ్యింది. అతనిపై గతంలో 17 తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి.

లిస్టులో క్రిమినల్స్, గ్యాంగ్​స్టర్లు

మైనర్​ బాలిక కిడ్నాప్, రేప్​ కేసులో పరారీలో ఉన్న సిట్టింగ్​ ఎమ్మెల్యే అరుణ్​ కుమార్​ యాదవ్​ భార్య కిరణ్​ దేవికి భోజ్​పూర్​ జిల్లాలోని సందేశ్​ అసెంబ్లీ సీటును ఆర్జేడీ కేటాయించింది. ఒక యువకుడిని చంపిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బింది యాదవ్​ భార్య మనోరమా దేవికి గయ జిల్లాలోని ఆత్రి సీటును ఆర్జేడీ ఇచ్చింది. అలాగే మాజీ ఎంపీ రామా సింగ్​ భార్యకు వైశాలి జిల్లా మహనార్​ అసెంబ్లీ సీటును అలాట్​ చేసింది. రామా సింగ్​ పై కిడ్నాప్, హత్య కేసులు ఉన్నాయి. దన్​పూర్​కు చెందిన గ్యాంగ్​స్టర్​ రిత్​​లాల్​ యాదవ్​.. కౌన్సిల్​కు ఇండిపెండెంట్​గా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఎన్నికల బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నారు. గత లోక్​సభ ఎన్నికలకు ముందు ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్​ యాదవ్​ రిత్​లాల్​ ఇంటికి వెళ్లి తన కూతురుకు సపోర్ట్ చేయాలని కోరారు. అప్పటి నుంచి రిత్​లాల్​కు ఇంపార్టెన్స్​ పెరిగింది. అలాగే మవోయిస్టు ప్రభావిత ప్రాంతమైన మగధ డివిజన్​లో మగధ సామ్రాట్​గా పెరున్న సురేందర్​ యాదవ్​ జహనాబాద్​ నుంచి బరిలో నిలబడ్డారు. 1994 నాటి గోపాల్​గంజ్ డీఎం మర్డర్​ కేసులో జైలో ఉన్న మాజీ ఎంపీ ఆనంద్​ మోహన్​ వైఫ్​ లవ్లీ ఆనంద్​కు ఆర్జేడీ షియోహర్​ టికెట్​ ఇచ్చింది.