పంజాబ్​లో డ్రగ్ సెన్సస్.. బాధితుల సంఖ్యను గుర్తించేందుకు ఇంటింటి సర్వే: హర్పాల్ సింగ్​

పంజాబ్​లో డ్రగ్ సెన్సస్.. బాధితుల సంఖ్యను గుర్తించేందుకు ఇంటింటి సర్వే: హర్పాల్ సింగ్​

చండీగఢ్: మాదక ద్రవ్యాలపై పోరులో భాగంగా రాష్ట్రంలో డ్రగ్ సెన్సస్ నిర్వహిస్తామని పంజాబ్ ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్ చెప్పారు. ఈమేరకు బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో హర్పాల్ సింగ్ ప్రసంగించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.2.36 లక్షల కోట్లతో బడ్జెట్​ను ప్రవేశపెట్టారు. డ్రగ్ సెన్సస్​కు రూ.5 వేల కోట్లు కేటాయించారు. 

మాదకద్రవ్యాలపై రాష్ట్రప్రభుత్వం పోరాడుతోందని, యువతను వీటి బారినుంచి కాపాడేందుకు చర్యలు తీసుకుంటోందనితెలిపారు. ఇందుకోసం డ్రగ్స్ బాధితుల కచ్చితమైన సంఖ్య తెలుసుకోవడా నికి డ్రగ్ సెన్సస్ నిర్వహించాలని నిర్ణయించామన్నారు. జనాభా లెక్కలు సేకరించిన తరహాలోనే సర్వేయర్లు ఇంటింటికీ వెళ్లి డ్రగ్ వివరాలు సేకరిస్తారని చెప్పారు.