బయట తిందామంటే భయం.. భయం : కుళ్లిన కూరగాయలు, సింథటిక్ ఫుడ్ కలర్స్

బయట తిందామంటే భయం.. భయం : కుళ్లిన కూరగాయలు, సింథటిక్ ఫుడ్ కలర్స్

బిజీ లైఫ్ షెడ్యూల్ కారణంగా ఇంట్లో వంట చేసుకొని తినే వారికంటే బయట హోటల్స్, రిస్టారెంట్లలో తినేవారి సంఖ్య బాగా పెరిగింది. దీంతో హోటల్ ఫుడ్ కు డిమాండ్ పెరిగింది. ఇదే అదునుగా హోటల్ యాజమాన్యాలు ఫుడ్ అడల్ట్రేషన్ కు పాల్పడుతున్నాయి. పైన పటారం.. లోన లొటారంగా పైపై మెరుగులతో కలర్ ఫుడ్ కస్టమర్స్ కు సర్వ్ చేసి.. ఫుడ్ తయారు చేసేటప్పుడు మాత్రం పరిశుభ్రత పటించడం లేదు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవల కాలంలో ఏ హోటల్ లో రైడ్ చేసినా.. భయంకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 

హైదరాబాద్ చైతన్యపురిలో ఫుడ్ సేఫ్టీ అధికారుల పలు హోటళ్లలో తనిఖీలు నిర్వహించారు. శిల్పి ఎలైట్ బార్ అండ్ రెస్టారెంట్ లో కుళ్లిపోయిన కూరగాయలను ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అక్కడి కిచెన్ పరిసరాలు, ఫ్రిడ్జ్ అపరిశుభ్రంగా ఉన్నాయని అన్నారు. వంటగదిలో బొద్దింకలు తిరుగుతున్నాయి. తయారుచేసే ఆహార పదార్థాల్లో సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నారన్న అధికారులకు తెలిసింది.

Also Read : టమాటా సాస్ ఉపయోగిస్తున్నారా..? 

బాహర్ బిర్యాని కేఫ్ లో కిచెన్ పరిసరాల్లో మురుగు నీరు ఉందని, సింథటిక్ ఫుడ్ కలర్స్, కాలం చెల్లిన పెప్పర్ సాస్, చాక్లెట్ సిరప్ వాడుతున్న రెస్టారెంట్ నిర్వాహకులు వినియోగిస్తున్నారని అధికారులు గుర్తించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కస్టమర్ల ఆరోగ్యంతో ఆటలాడుతున్న రెస్టారెంట్ నిర్వహకుల మీద అధికారులు చర్యలు తీసుకున్నారు.