
ఆదిలాబాద్టౌన్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు విద్య, ఉద్యోగం, రాజకీయాల్లో అవకాశాలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించి పెద్దపీట వేసిందని ఆదిలాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం ప్రజాసేవా భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం రాజీవ్ యువ వికాస్ పథకం ప్రారంభించిందని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లును తీసుకువచ్చినా సీఎం రేవంత్రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భూపెల్లి శ్రీధర్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చరణ్ గౌడ్, నాయకులు పవన్, మునిగేల నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.