కటింగ్ స్టైల్​ నచ్చలేదని..  6వ తరగతి స్టూడెంట్​ సూసైడ్​

కటింగ్ స్టైల్​ నచ్చలేదని..  6వ తరగతి స్టూడెంట్​ సూసైడ్​

కొత్తగూడ,(గంగారం) వెలుగు : మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం చింతగూడెంలో తండ్రి చేయించిన కటింగ్​ స్టైల్​ నచ్చలేదంటూ 6వ తరగతి స్టూడెంట్​ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ రవికుమార్​కథనం ప్రకారం చింతగూడెం గ్రామానికి చెందిన రేషన్​ డీలర్​ఈసం కాంతారావుకు ఇద్దరు కొడుకులు. చిన్న కొడుకు హర్షవర్ధన్(9)​ గూడూరు మండలం సీతానాగారం గిరిజన ఆశ్రమ హైస్కూల్​లో 6 వతరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులు ఇవ్వడంతో ఇంటి దగ్గరే ఉంటున్నాడు. ఈనెల 25న కాంతారావు తన కొడుకు హర్షవర్ధన్​కు కటింగ్​ చేయించాడు.

ఆ కటింగ్​స్టైల్​ బాగా లేదని తండ్రితో గొడవ పెట్టుకోగా, సర్ధి చెప్పి ఇంటికి తీసుకువచ్చాడు. తల్లిదండ్రులు ఇంటి వెనక పని చేసుకుంటుండగా లోపలున్న హర్షవర్ధన్​ పురుగుల మందు తాగాడు. వాంతులు చేసుకుంటుండడంతో ఏమైందని అడగ్గా ‘నాకు ఈ కటింగ్ ​స్టైల్​నచ్చలే...అయినా నువ్వు నీకు నచ్చినట్టే చేయించినవ్. అందుకే పురుగుల మందు తాగినా’ అని సమాధానమిచ్చాడు. వెంటనే నర్సంపేటకు, అక్కడి నుంచి హైదరాబాద్​కు తరలించగా చికిత్స పొందుతూ గురువారం చనిపోయాడు.