- అగ్రనేతలకే చాన్స్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
- ఉత్తమ్‌కు హోం, వెంకట్‌రెడ్డికి మున్సిపల్ శాఖ కేటాయించనున్నట్లు ప్రచారం
- తెలంగాణ ఏర్పాడ్డాక నల్గొండ జిల్లా తొలి మంత్రిగా కోమటిరెడ్డి రికార్డు
- పేట జిల్లాకు రెండో మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి
నల్గొండ, వెలుగు : తెలంగాణ వచ్చాక తొలిసారి ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లాకు రెండు మంత్రి పదవులు దక్కాయి. 2014, 2018లో అధికారం చేపట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉమ్మడి జిల్లా నుంచి ఒక్కరినే మంత్రిగా కొనసాగించింది. సీఎం రేవంత్ రెడ్డి తన కేబినెట్‌లో నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, హుజూర్ నగర్ ఎమ్మెల్యే నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంత్రులుగా అవకాశం ఇచ్చారు.
కోమటి రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసినా.. తెలంగాణ ఏర్పాటయ్యాక నల్గొండ జిల్లా నుంచి తొలి మంత్రి కావడం విశేషం. ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేటకు రెండో మంత్రి. ఆయనకు హోం శాఖ మంత్రి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మున్సిపల్ శాఖ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఉద్యమంలో మంత్రి పదవి వదులుకున్న కోమటిరెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లా తొలి మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి రి కార్డుకెక్కారు. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వెం కటరెడ్డి 2003లో జిల్లాలో ఫ్లోరైడ్ విముక్తి కోసం నల్గొండ క్లాక్ టవర్ సెంట ర్లో 11 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఐదు సార్లు ఎమ్మె ల్యేగా, ఒక సారి ఎంపీగా గెలిచారు. మాజీ సీఎంలు డాక్టర్ వై.ఎస్.రాజశేఖ ర్ రెడ్డి, రోశయ్య మంత్రివర్గంలో ఐటీ, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రిగా పనిచేశారు.
మళ్లీ కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రి వర్గంలో పెట్టు బడులు, మౌలిక వసతులు, ఓడరేవుల శాఖ మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో 2011లో మంత్రి పదవి వదులుకున్నారు. మళ్లీ ఇన్నాళ్లకు సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్‌లో మంత్రిగా ప్రమాణం చేశారు.
జిల్లా నుంచి కేబినెట్ మంత్రాంగం
జిల్లాలో 2018 వరకు 16 మంది మంత్రులు ఆయా కేబినెట్లలో పనిచేసినా సుధీర్ఘ కాలం పనిచేసిన రికార్డు కుందూరు జానారెడ్డికే ఉంది. జిల్లా నుంచి మొదటిసారిగా కొండా లక్ష్మణ్ బాపూజీ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి, అక్కిరాజు వాసుదేవరావు, పాల్వాయి గో వర్ధన్ రెడ్డి, రవీంద్ర నాయక్, కొమ్ము పాపయ్య, కుందూరు జానారెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, వీరేపల్లి లక్ష్మీనారాయణ, గుత్తా మోహన్ రెడ్డి, ఎలిమినేటి మాదవరెడ్డి, రాంరెడ్డి దామోదర్ రెడ్డి, ఎలిమినేటి ఉమా మాదవ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పలువురి మంత్రి వర్గాల్లో పనిచేశారు.
1957లో చిన్న కొండూరు నుంచి విజయం సాధించిన కొండా లక్ష్మణ్ తొలి శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా పనిచేయడంతో పాటు 1960, 1967లో దామోదరం సంజీవయ్య, కాసు బ్రహ్మనందరెడ్డి మంత్రి వర్గాల్లో పనిచేశారు. తర్వాత1971లో హుజూర్నగర్ నుంచి గెలిచిన అక్కిరాజు వాసుదేవరావు 1971లో కాసు బ్ర హ్మనందరెడ్డి, తర్వాత పీవీ నర్సింహరావు మంత్రి వర్గాల్లో సమాచార మంత్రిగా వ్యవహరించారు.
1971లో కాసు బ్రహ్మనందరెడ్డి, జలగం వెంగళం రావు మంత్రి వర్గాల్లో ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి, భవనం వెంకట్రాం, కోట్ల విజయభాస్కర్ రెడ్డి కేబినెట్‌లో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, టీ. అంజయ్య మంత్రి వర్గంలో కొమ్ము పాపయ్య, భవనం వెంకట్రాం కేబినెట్‌లో రవీంద్రనా యక్, ఎన్టీఆర్, నేదురమల్లి జనార్ధన్ రెడ్డి, విజయభాస్కరరెడ్డి, వైఎస్‌ల కేబినెట్లలో కుందూరు జానారెడ్డి, ఎన్టీఆర్ కేబినెట్‌లో మోత్కుపల్లి నర్సింహులు, నాదేళ్ల భాస్కర్‌రావు కేబినెట్‌లో వీరేపల్లి లక్ష్మీనారాయణ, గుత్తా మోహన్ రెడ్డి, నేదురమల్లి, వైఎస్ కేబినెట్‌లో రాంరెడ్డి దామోదర్ రెడ్డి, ఎ న్టీఆర్, చంద్రబాబు కేబినెట్‌లో ఎ. మాదవరెడ్డి, చంద్రబాబు కేబినెట్‌లో ఉ మామాదవరెడ్డి, వైఎస్, రోశయ్య కేబినెట్‌లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్‌లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి పనిచేశారు. జిల్లాలో అత్యధిక కాలం మంత్రిగా పనిచేసిన రికార్డు జానారెడ్డి పై ఉండగా, కేవలం నెల రోజుల పాటు పనిచేసిన మంత్రులుగా గుత్తా మోహన్ రెడ్డి, వీరేపల్లి లక్ష్మీనారాయణ నిలిచారు.
రికార్డు మాత్రం జానారెడ్డిదే..
సోషలిస్టు భావాలతో రాజకీయాల్లో చేరి ఏడు మార్లు రాష్ట్ర శాసనసభకు ఎన్నికైన జానారెడ్డి రాష్ట్రంలోనే ఓ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. 1983 నుంచి 88 వరకు, 92 నుంచి 94 వరకు, 2004 నుంచి 2009 వ రకు ఎన్టీఆర్, విజయభాస్కరరెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి, కిరణ్ కుమార్ రె డ్డిల మంత్రి వర్గాల్లో దాదాపు 12ఏళ్ల పాటు కేబినెట్ మంత్రిగా పనిచేసి రికార్డు స్థాపించారు.
ఇంతకాలం పాటు మరెవరూ రాష్ట్ర కేబినెట్ మంత్రిగా పనిచేయలేదు. ఇంతకు ముందు ఈ రికార్డు తెలుగు దేశం పార్టీకి చెందిన అశోక గజపతిరాజు పేరున ఉండేది. జిల్లాలో అత్యధిక కాలం పనిచేసిన మంత్రిగా కూడా జానారెడ్డి కావడం విశేషం. ఇక జిల్లా నుంచి హోమంత్రిగా ఎలిమినేటి మాదవరెడ్డి పనిచేయగా, తర్వాత ఆయన వైద్య ఆరోగ్య, పంచాయతీరాజ్ శాఖల నిర్వహించారు. మోత్కుపల్లి నర్సింహులు సైతం సాంఘీక సంక్షేమ, వైద్య, ఆరోగ్య శాఖ, గనులు భూగర్భవనరులు, సాం స్కృతిక వ్యవహరాల శాఖలను నిర్వహించారు.