
శివ్వంపేట, వెలుగు: మండలంలోని ఎదుల్లాపూర్లో నాలుగు రోజులుగా గ్రామ దేవతలకు పూజలు నిర్వహించి బొడ్రాయిని ప్రతిష్టించారు. పోతరాజుల విన్యాసాలు, ఒగ్గు కథల మధ్య లింగమయ్యకు బోనం సమర్పించారు. గ్రామస్తులు అందరు కలిసి భక్తిశ్రద్ధలతో పోచమ్మ, ఎల్లమ్మ, దుర్గమ్మలకు ఒడి బియ్యం పోశారు.
బొడ్రాయి ప్రతిష్టాపన సందర్భంగా బంధువులను పిలిపించుకొని పండగను చేసుకున్నారు. సోమవారం అమ్మవార్లకు బోనాలు, బండ్ల ఊరేగింపు నిర్వహిస్తామని ఎంపీపీ హరికృష్ణ, సర్పంచ్ కీర్తన హనుమంతరావు తెలిపారు.