గుడిహత్నూర్లో ఎడ్ల బండిపై ఎన్నికల ప్రచారం

గుడిహత్నూర్, వెలుగు: గ్రామాలు, పట్టణాలు, ఏజెన్సీ ఏరియాల్లో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇంద్రవెళ్లి మండలంలోని ఏమాయికుంట గ్రామంలో మండల బీజేపీ నాయకులు వినూత్నంగా ఎడ్లబండిపై ప్రచారం మొదలు పెట్టారు.

గ్రామంలోని హనుమాన్‌ టెంపుల్‌లో ప్రత్యేక పూజలు చేసి ఎడ్లబండికి బీజేపీ ఫ్లెక్సీలు, జెండాలతో అలంకరించి ప్రచారం ప్రారంభించారు. ఖానాపూర్‌ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రాథోడ్‌ రమేశ్​ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బీజేపీ మండల ప్రెసిడెంట్‌ఆరెల్లి రాజలింగం ఓటర్లను వేడుకున్నారు.