ఫస్ట్ టైం..ప్రధాని మోదీకి మహిళా సెక్యూరిటీ గార్డులు

ఫస్ట్ టైం..ప్రధాని మోదీకి మహిళా సెక్యూరిటీ గార్డులు

దేశంలోనే మొదటిసారి..దేశ ప్రధానికి తొలిసారి మహిళా సెక్యూరిటీ టీం..కానిస్టేబుళ్లు, ఎస్ఐలు, సీఐలు, డీఎస్పీలు, ఎస్పీలు, ఐజీ, డీజీపీలు, అదనపు డీజీపీలతో సహా అందరూ మహిళా పోలీసు సిబ్బందే. ప్రధాని మోదీ గుజరాత్ పర్యటన సందర్భంగా ఈ పూర్తిస్థాయి మహిళా సెక్యూరిటీని ఏర్పాటు చేసింది అక్కడి ప్రభుత్వం. ఇది దేశ చరిత్రలోనే మొదటిది. ఇంతకీ ఎందుకు దేశ ప్రధానికి ఫుల్ సెక్యూరిటీగా మహిళా సిబ్బందిని ఏర్పాటు చేశారు? పూర్తి వివరాల్లోకి వెళితే.. 

ALSO READ | తెలంగాణ ప్రజలకు మోదీ కృతజ్ఞతలు

మార్చి8న ప్రధాని మోదీ గుజరాత్ లోని సవ్సరి జిల్లాలో పర్యటించునున్నారు. ఓ సభలో కూడా పాల్గొననున్నారు. ఈ సభకు పూర్తి స్థాయిలో మహిళా పోలీసు సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేసింది గుజరాత్ రాష్ట్ర  ప్రభుత్వం.2వేల100 కుపైగా కానిస్టేబుళ్లు, 187 మంది ఎస్ఐలు, 61 మంది పోలీస్ సీఐలు, 16 మంది డీఎస్పీలు, ఐదుగురు ఎస్పీలు, ఒక ఐజీ, ఒక అదనపు డిజిపి ర్యాంక్ అధికారితో సహా అందరూ మహిళా పోలీసు సిబ్బందే.సీనియర్ మహిళా ఐపీఎస్ అధికారిణి, హోం కార్యదర్శి నిపుణ తోరావనే భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. దేశంలో ఇది మొదటిసారి. 

ఇక ఈ భద్రతా ఏర్పాట్లపై గుజరాత్ మంత్రులు మాట్లాడుతూ..దేశంలోనే తొలిసారి ప్రధానికి మహిళా సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాం..గుజరాత్ సురక్షితంగా ఉంచడంతో మహిళలు ఎంతటి కీలక పాత్ర పోషిస్తున్నారో.. మహిళా దినోత్సవం రోజున ప్రపంచానికి బలమైన సందేశాన్ని ఇచ్చేందుకు ఇలా ఏర్పాటు చేశామని చెబుతున్నారు.