దేశ రాజధాని ఢిల్లీలో 2020 ఫిబ్రవరిలో భారీ స్థాయిలో అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో అనేకమంది చనిపోయారు. అయితే ఆ ఘటనపై నమోదు అయిన కేసులో ఇవాళ ఢిల్లీ కోర్టు తీర్పునిచ్చింది. అల్లర్ల కేసులో ప్రధాన నిందితుడు అయిన దినేశ్ యాదవ్‌కు అయిదేళ్ల జైలుశిక్షను కోర్టు ఖరారు చేసింది. దినేశ్ యాదవ్ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడి హింసకు దిగాడు. ఆ కేసులో గత నెలలోనే అతన్ని దోషిగా తేల్చారు. 73 ఏళ్ల మహిళ ఇంటికి నిప్పుపెట్టిన కేసులోనూ దినేశ్‌ను నిందితుడిగా ప్రకటించారు. అయితే ఇవాళ ఆ కేసులో తీర్పునిస్తూ.. దినేశ్‌కు అయిదేళ్ల శిక్ష విధించారు. ఈ కేసుకు సంబంధించి ఇదే తొలి శిక్ష కావడం విశేషం. యాదవ్ చేసిన నేరాలకు గరిష్టంగా పదేళ్ల వరకు జైలు శిక్ష పడొచ్చు.
యాదవ్ ఈ "అల్లరి మూకలో చురుకైన సభ్యుడు" అని అతనే ఈ దాడుల్లో కీలక పాత్ర పోషించాడని ప్రాసిక్యూషన్ వాదించింది. ఈశాన్య ఢిల్లీలోని గోకుల్‌పురిలోని భాగీరథి విహార్‌లో ఉన్న మహిళ ఇంటిని ధ్వంసం చేయడంలో దహనం చేయడంలో దినేశ్ యాదవ్ కీలక పాత్ర పోషించాడని పేర్కొంది. బాధితురాలు మనోరి మాట్లాడుతూ... ఇంట్లో ఎవరూ లేని సమయంలో దాదాపు 150 నుంచి 200 మంది అల్లరి మూక తన ఇంటిపై దాడి చేసిందని పేర్కొంది. ఇంట్లో ఉన్న అనేక విలువైన వస్తువుల్ని కూడా దోచుకున్నారని ఆరోపించింది. దీంతో ఆమె ఎంతో భయంతో ఇంటి పై నుంచి బయటకు దూకాల్సి వచ్చిందని కోర్టుకు తెలిపింది. ప్రాణాలు కాపాడుకునేందుకు పొరుగున ఉన్న వారి ఇంట్లోక వెళ్లి తల దాచుకున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ లోపు తమ కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఆమెను కాపాడారని చెప్పింది.
2020లో ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లలో సుమారు 50 మంది మృతిచెందగా, మరో 200 మంది గాయపడ్డారు. అల్లర్ల సృష్టించిన గ్యాంగ్‌లో దినేశ్ యాక్టివ్‌గా ఉన్నట్లు ప్రాసిక్యూషన్ వాదించింది. తన ఇంటిపై సుమారు 200 మంది దాడి చేసి నిప్పుపెట్టారని 73 ఏళ్ల మహిళ మనోరి కోర్టుకు తెలిపింది. ఫిబ్రవరి 25వ తేదీన ఈ ఘటన జరిగింది. ఇంట్లో ఉన్న విలువైన వస్తువుల్ని కూడా ఎత్తుకెళ్లినట్లు ఆమె ఆరోపించింది. ఇదే కేసులో నిన్న ఆరుగురికి ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరీ చేసింది. గోకుల్‌పురి ప్రాంతంలో ఓ షాపుకు నిప్పుపెట్టినట్లు నమోదు అయిన కేసులో వారికి బెయిల్ దొరికింది.
ఇవి కూడా చదవండి:
అఖిలేష్ యాదవ్ కు మరో షాక్
ఎమ్మెల్యేను తరిమికొట్టిన గ్రామస్థులు