- మునుగోడు నుంచి చల్లమల్ల కృష్ణారెడ్డి ఖరారు
- కోదాడ టికెట్జనసేనకు కేటాయింపు
నల్గొండ, వెలుగు : బీజేపీ నాలుగో జాబితాలో నల్గొండ జిల్లాలో ముగ్గురికి చోటు దక్కింది. మునుగోడు నుంచి చల్లమల్ల కృష్ణారెడ్డి, నకిరేకల్ నుంచి నకిరేకంటి మొ గులయ్య (ఎస్వీ రిజర్వుడ్), మిర్యాలగూడ నుంచి సాధినేని శ్రీనివాస్ రావు పేర్లను హైకమాండ్ ఖరారు చేసింది. మునుగోడు కాంగ్రెస్ టికెట్ఆశించిన కృష్ణారెడ్డి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. మునుగోడు అభ్యర్థిగా ఆయననే కన్ఫాం చేసింది. కమ్మసామాజిక వర్గానికి మిర్యాలగూడ సీటు కేటాయిచింది.
సాధినేని శ్రీనివాస్‌రావు ప్రస్తుతం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు. నకిరేకంటి మొగలయ్య రామన్నపేట మాజీ సర్పంచ్. మొత్తం 12 స్థానాలకు గాను పొత్తులో భాగంగా కోదాడ జనసేనాకు కేటాయించారు. ఇక్కడి నుంచి ఆ పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ మేకల సతీశ్ రెడ్డి ప్రకటించారు. దీంతో జిల్లాలో బీజేపీ అభ్యర్థులు ఎంపిక పూర్తయినట్టే.