సాన్ ఫెర్నాండో (ట్రినిడాడ్): ఓపెనర్ ఫిల్ సాల్ట్ (57 బాల్స్‌లో 7 ఫోర్లు, 10 సిక్స్‌లతో 119) వరుసగా రెండో సెంచరీతో చెలరేగడంతో.. మంగళవారం అర్ధరాత్రి ముగిసిన నాలుగో టీ20లో ఇంగ్లండ్ 75 రన్స్ తేడాతో వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–2తో సమం చేసింది. విండీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 267/3 స్కోరు చేసింది.
షార్ట్ ఫార్మాట్‌లో ఇంగ్లిష్ టీమ్‌కు ఇదే అత్యధిక స్కోరు. సాల్ట్, బట్లర్ (55) తొలి వికెట్‌కు 117 రన్స్ జోడించి అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. విల్ జాక్స్ (24) ఫెయిలైనా, లియామ్ లివింగ్‌స్టోన్ (54 నాటౌట్) దంచికొట్టాడు. సాల్ట్‌తో కలిసి మూడో వికెట్‌కు 73 రన్స్ జోడించాడు.
ఛేజింగ్‌లో విండీస్ 15.3 ఓవర్లలో 192 రన్స్‌కే ఆలౌటైంది. ఆండ్రీ రసెల్ (51) టాప్ స్కోరర్. నికోలస్ పూరన్ (39), రూథర్‌ఫోర్డ్ (36) పోరాడి విఫలమయ్యారు. రీస్ టోప్లే 3, సామ్ కరన్, రెహాన్ అహ్మద్ చెరో రెండు వికెట్లు తీశారు. ఫిల్ సాల్ట్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య సిరీస్ డిసైడర్ మ్యాచ్ శుక్రవారం తరౌబాలో జరుగుతుంది.