బైజూస్ కోచింగ్ సెంటర్ ముందు.. బాధితుల ఆందోళన

బైజూస్ కోచింగ్ సెంటర్ ముందు.. బాధితుల ఆందోళన

హైదరాబాద్: నారాయణగూడలోని బైజూస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ముందుకు విద్యార్థులు ఆందోళనకు దిగారు. కోర్సు పూర్తి కాకముందే బైజూస్ యాజమాన్యం బోర్డు తిప్పేసిందని బాధిత విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేరశారు. నారాయణ గూడలోని ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ముందు బైఠాయించారు. తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. 

2022 -24 కోర్సు కోసం ఒక్కొక్కరి వద్ద రూ. లక్ష యాభై వేలు వసూలు చేసి మధ్యలోనే బోర్డు తిప్పేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్సు మధ్య ఆపేసీ తమను రోడ్డుపై పడేశారని విద్యార్థులు అన్నారు.  మధ్యతరగతి కుటుంబాలకు చెందిన తాము సివిల్స్ లో ఉద్యోగం సాధించాలని ఈ కోర్సు తీసుకున్నట్లు చెప్పారు. అయితే బైజుస్ సంస్థ 50 శాతం సిలబస్ కూడా పూర్తి చేయలేదని... ఇప్పుడు కోచింగ్ సెంటర్ కు తాళాలు చేశారని వాపోయారు. 

ALSO READ | 11వేల మందికి జీరో లేదా అంతకంటే తక్కువ నెగిటివ్ మార్కులు

కోచింగ్ సెంటర్ ఫ్యాకల్టీను ఆడితే కోర్టులో కేసు నడుస్తుంది తమకు ఎలాంటి సంబంధం లేదని చేతులు ఎత్తేశారని తెలిపారు. బైజుస్ ఐఏఎస్ కౌచింగ్ సెంటర్ వల్ల సమయాన్ని , డబ్బును పోగొట్టుకున్నామని  రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకొనితమకు ప్రత్యామ్నాయం చూపాలని కోరారు విద్యార్థులు.