వీఆర్ఏల 'పే స్కేల్ జాతర'

వీఆర్ఏల 'పే స్కేల్ జాతర'

జగిత్యాల, వెలుగు : తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్  చేస్తూ వీఆర్ఏల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారం 26 వ రోజుకు చేరింది.  సమ్మెలో భాగంగా జగిత్యాల ఆర్డీవో ఆఫీస్ ఎదుట వీఆర్ఏల పేస్కేల్ జాతర పేరిట వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. పులి వేషధారణలతో మహిళలు బోనాలు, బతుకమ్మలను ఎత్తుకుని ఆర్డీవో ఆఫీస్ నుంచి కొత్త బస్టాండ్ మీదుగా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

తెలంగాణ ఉద్యమం సందర్భంలో స్వరాష్ట్రం కోసం ఆందోళన చేశామని, ఇప్పుడు రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా తమ హక్కుల కోసం పోరాడాల్సి వస్తున్నదని జేఏసీ లీడర్లు ఆవేదన వ్యక్తం చేశారు. వీఆర్ఏలకు పేస్కే ల్ జీవో జారీ చేయాలని, ప్రమోషన్లు, వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్ సమీపంలో సమావేశం నిర్వహించారు. తమ సమస్యల సాధన కోసం చేయాల్సిన పోరాట కార్యాచరణపై చర్చించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ లీడర్లు కంది శిరీషా రెడ్డి, సునీత, కందుకూరి బాపుదేవ్, తదితరులు పాల్గొన్నారు.