
రేగొండ, వెలుగు: కార్పొరేట్ విద్యాసంస్థకు దీటుగా సర్కార్ స్కూళ్లలో విద్యా వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం బలోపేతం చేస్తుందని జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి అన్నారు. మంగళవారం గోరికొత్తపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వం పాఠశాలల్లో ఈ ఏడాది 10 వతరగతి ఫలితాల్లో పస్ట్, సెకండ్ వచ్చిన 25 మంది విద్యార్థులకు రూ. 5000 ప్రోత్సాహక బహుమతిని జడ్పీటీసీ సాయిని విజయముత్యం అందించారు. కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రోత్సాహక బహుమతులు అందించిన విజయ ముత్యంలను అభినందించారు.
మనం చేసే సేవ వారి కుటుంబాలకు ఎంతో అండగా ఉంటుందన్నారు. సర్కారు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహారం కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మటికె సంతోష్, నాయకులు మోడెం ఉమేశ్, పున్నం రవి, పాతపెల్లి సంతోష్, అమ్ముల రాజయ్య, అంబాల చందు, కూందురు విద్యాసాగర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.