హైదరాబాద్: గోశామహల్లో నడిబజారులో రోడ్డు కుంగిపోయింది. రోడ్డు కుంగిపోవడంతో ఓ డీసీఎం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడనప్పటికీ రోడ్డు నిర్మాణంపై తీవ్ర విమర్శలు , ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.. గతేడాది ఇదే ప్రాంతంలో రోడ్డు కుంగిపోయింది. ఇది రెండోసారి.. ఇలా అయితే ఎలా అయిన స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గతేడాది గోశామహల్ లోని ఇదే ప్రాంతంలో రోడ్డు కుంగిపోయింది. దీంతో బీఆర్ ఎస్ ప్రభుత్వం ఐదు కోట్ల రూపాయలు వెచ్చించి నాలాపై రోడ్డు నిర్మాణం చేసింది. శనివారం జూలై 28, 2024నాడు సాయంత్రం ఓ డీసీఎం లారీ వెళ్తుండగా నాలాపై ఉన్న రోడ్డు కుంగిపోయింది. దీంతో డీసీఎం బోల్తాపడింది. నాలాపై నాసిరకం రోడ్డు నిర్మించడం వల్లే కూలిపోయిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే తిరిగి నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.