ఆస్పత్రులకు పోషకాహారం అందించే ఏజెన్సీలపై జీవో జారీ

ఆస్పత్రులకు పోషకాహారం అందించే ఏజెన్సీలపై జీవో జారీ

హైదరాబాద్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో పోషకాహారం అందించే ఏజెన్సీల విషయంలో సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ వర్గాలకు కేటాయిస్తూ జీవో నెంబర్ 32 జారీ చేసింది. గరిష్ఠంగా 500 పడకల వరకు సామర్థ్యం ఉన్న దవాఖానలకు రిజర్వేషన్ వర్తింపజేసింది. 
ఇందుకోసం హాస్పిటళ్లను రెండు కేటగిరీలుగా విభజించింది. 100 వరకు బెడ్లు ఉన్న హాస్పిటల్ లను ఏ కేటగిరి గా, 500 వరకు బెడ్లు ఉన్న హాస్పిటల్ లను బి కేటగిరిగా నిర్ధారించింది.
ఏ హాస్పిటల్లో రిజర్వేషన్ కల్పించాలనేది డ్రా ద్వారా నిర్ధారించాలి. 
కనీస టర్నోవర్ ను 50% తగ్గించాలి. 
రిజర్వుడ్ హాస్పిటల్ కు ఒక్క బిడ్ వచ్చినా  పరిగణలోకి తీసుకోవాలి. 
ఒకవేళ ఒక్కటి రాకపోతే మరోసారి టెండర్ ఆహ్వానించాలి. అప్పుడు కూడా బిడ్లు రాకపోతే ఓపెన్ టెండర్లు పిలవాలి.


 

ఇవి కూడా చదవండి

కొడుకు ఎమ్మెల్యేగా గెలిచినా స్వీపర్ ఉద్యోగం వదలను

దేశ భద్రతపై ప్రధాని అత్యున్నత స్థాయి సమావేశం

రేపు తన స్వగ్రామంలో కందికొండ అంత్యక్రియలు