ఏకంగా ప్రైవేట్ టోల్ బూత్ పెట్టారు.. 80 కోట్లు నొక్కేశారు..

మీరు వాహనాలతో రోడ్డెక్కుతున్నారా.. హైవేపై వెళుతున్నారా.. మీకు కచ్చితంగా టోల్ బూత్ అయితే వస్తుంది.. మీ జేబులో రూపాయి లేకపోయినా పర్వాలేదు.. మీ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతాయి.. ఇది రెగ్యులర్ గా జరిగేది.. గుజరాత్ రాష్ట్రంలో సీన్ రివర్స్.. ఇక్కడ హైవేపై.. ఓ మాఫియా ముఠా.. ప్రైవేట్ టోల్ బూత్ ఏర్పాటు చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధం లేకుండా.. మాఫియా ముఠా టోల్ బూత్ ఏర్పాటు చేసింది ఎప్పుడో తెలుసా.. అక్షరాల ఒకటిన్నర సంవత్సరాల క్రితం.. ఈ 18 నెలల్లో.. ఏకంగా 80 కోట్ల రూపాయలు.. పైసా పెట్టుబడి లేకుండా వాహనాలదారుల దోపిడీ చేశారు.. ప్రపంచంలోనే ఇలాంటి దోపిడీ గుజరాత్ రాష్ట్రంలో వెలుగులోకి రావటం సంచలనంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

గుజరాత్ రాష్ట్రం మోర్బి జిల్లా వంకనేర్ ప్రాంతం. అసలు ఇక్కడ రోడ్డు సక్రమంగా లేదు.. అయితే ఈ మాఫియా ఓ రోడ్డును సొంత డబ్బులతో ఏర్పాటు చేసి.. అక్కడ టోల్ బూత్ పెట్టారు. ఈ రహదారిలో మూతపడిన సిరామిక్ ఫ్యాక్టరీ అడ్డాగా.. మార్బి.. వాంకనేర్ గ్రామాల మధ్య  బమన్ బోర్ కచ్ ఏరియాలో ఈ టోల్ బూత్ ఏర్పాటు చేశారు. ఈ రహదారిలో వెళ్లే వాహనాల నుంచి నుంచి 20 నుంచి 200 రూపాయల వరకు వసూలు చేసే వారు. కార్లకు 100, లారీలకు 200 ఇలా ఛార్జ్ చేసేవారు. ఈ టోల్ బూత్ డిజిటల్ పేమెంట్లు లేవు.. కేవలం డబ్బులు కట్టాలి లేదా.. వాళ్లు అక్కడ అంటించిన క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు చేసేవారు వాహనదారులు. అదేంటీ ఫాస్ట్ ట్యాగ్ లేదా అంటే.. ఇది స్టేట్ హైవ్ కు అనుబంధంగా ఉన్న రహదారి.. నేషనల్ హైవే కాదు అని సమాధానం ఇచ్చేవారు నిర్వాహకులు. ఇలా ఏడాదిన్నరగా 80 కోట్ల రూపాయలు వాహనదారుల నుంచి వసూలు చేశారు.

ఈ రహదారిలో వెళుతున్న కొందరు ఉన్నతస్థాయి ఉద్యోగులు, కాంట్రాక్టర్లకు అనుమానం వచ్చి కంప్లయింట్ ఇవ్వగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మోర్బి జిల్లా కలెక్టర్ పాండ్యా ఆధ్వర్యంలో విచారణ జరగ్గా.. ఐదుగురు వ్యక్తుల ప్రమేయం ఉందని గుర్తించి.. వారిని అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒకరు పదవీ విరమణ చేసిన ఆర్మీ ఉద్యోగి ఉండటం విశేషం. మిగతా నలుగురు నిందితులు అమర్షి పటేల్, రవిరాజ్‌సింగ్ ఝాలా, హర్విజయ్‌సిన్హ్ ఝాలా, ధర్మేంద్రసింగ్ ఝాలా, యువరాజ్‌సిన్హ్ ఝాలాగా గుర్తించి పోలీసులు కేసు బుక్ చేశారు.

ఎంత కంట్రీగాళ్లు కాకపోతే.. ఏకంగా ఓ టోల్ బూత్ ను ఏర్పాటు చేసి ఏడాదిన్నరగా వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది