గుండాల, వెలుగు : మండలంలో గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు వందల సంఖ్యలో ఇండ్లు నీట మునిగాయి. ఈ వర్షాలకు15కుటుంబాలకు చెందినవారి ఇండ్లు పూర్తిగా నిలువ నీడ లేకుండా కొట్టుకుపోయాయి. కట్టుకున్న బట్టలు తప్పా ఏమి మిగల్లేవు. దీనికి తోడు ఆ కుటుంబాలు పండించిన పంట ఉత్పత్తులు కూడా కొట్టుకుపోయాయి.
విషయం తెలుసుకున్న మండలానికి చెందిన వ్యాపారి మాడే మంగయ్య బియ్యం, నిత్యావసర సరుకులు బాధితులకు పంపిణీ చేశారు. భారీ వర్షాలకు గుండాల– సాయినపల్లి మధ్య ఇరువైపులా భారీ గండి కొట్టినా నిచ్చెన సాయంతో 15క్వింటాళ్ల బియ్యాన్ని వాగు దాటించి పంపిణీ చేశారు.