ములుగు/నల్లబెల్లి, వెలుగు : దసరాను పురస్కరించుకొని రావణ వధ నిర్వహించేందుకు ములుగులోని సాధన హైస్కూల్ గ్రౌండ్‌లో భారీ ఏర్పాట్లు చేశారు. దసరా ఉత్సవాల్లో భాగంగా క్లాసికల్ డ్యాన్స్, మిమిక్రీ, జానపద నృత్యాలు వంటి కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఉత్సవ సమితి అధ్యక్షుడు గండ్రకోట కుమార్ చెప్పారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉత్సవాలు జరుగుతాయని, ఈ కార్యక్రమానికి రిటైర్డ్ ప్రొఫెసర్, ప్రముఖ సామాజిక, సాహితీ వేత్త గిరిజామనోహర్ బాబు హాజరుకానున్నట్లు తెలిపారు.
ప్రజలు అధిక సంఖ్యలో హాజరై సక్సెస్ చేయాలని కోరారు. ఆయన వెంట కన్వీనర్ నగరపు రమేశ్, ఓడరాజు గౌడ్, కొత్త సురేందర్, సానికొమ్మ శ్రీనాథ్‌రెడ్డి, మేడుదుల మమన్‌కుమార్, పోరిక జశ్వంత్, ఉప్పుల శ్రీతన్, చెలుమల్ల రాజేందర్, భుక్యా కల్యాణ్ పాల్గొన్నారు. అలాగే వరంగల్ జిల్లా నల్లబెల్లిలోని ఎస్సారెస్పీ కాల్వ సమీపంలో రావణవధకు ఏర్పాట్లు చేశారు. అలాగే నారక్కపేటలో సీతారామాంజనేయ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో పోచమ్మ రావణాసుర వధకు ఏర్పాట్లు చేశారు.