హైదరాబాద్ లోని మీర్ చౌక్ పోలీస్ స్టేషల్ పరిధిలో మంగళవారం 17ఏళ్ల యువతి తనను బీఆర్ఎస్ నాయకుడి కుమారుడు మోసం చేశాడని కేసు నమోదు చేసింది. మైనర్ బాలికపై యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడని, తర్వాత ఆమె తల్లిదండ్రులతో మాట్లాడి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి ఇప్పడు మొఖం చాటేస్తున్నాడని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు బీఆర్ఎస్ పార్టీ నేత ఇనాయత్ అలీ బక్రీ కుమారుడిగా పోలీసులు తెలిపారు.
మూడు నెలలుగా యువతి మెసేజ్, కాల్స్ కు సమాధానం ఇవ్వకుండా దూరం పెడుతున్నాడని బాలిక ఆవేదన వ్యక్తం చేసింది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు రియాజ్ ను కస్టడీలోకి చేసుకొని విచారిస్తున్నారు. యువతి స్టేట్ మెంట్ తీసుకున్న పోలీసులు మైనర్ యువతిని మెడికల్ టెస్టులకు పంపించారు.