జగిత్యాల జిల్లాలో మంత్రి కొప్పుల ఈశ్వర్ పీఏ తమ భూమిని కబ్జా చేశాడని ప్రజావాణిలో ఫిర్యాదు నమోదైంది. మంత్రి కొప్పుల ఈశ్వర్ వ్యక్తిగత సలహాదారు (పీఏ) వామన్ రావుపై జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు జగిత్యాల పట్టణానికి చెందిన కొందరు వ్యక్తులు.
మంత్రి పీఏ వామన్ రావు.. బుగ్గారం మండలం చిన్నపూర్ గ్రామంలో తమ పట్టా భూములను కబ్జా చేశాడని జగిత్యాల పట్టణానికి చెందిన జవ్వాజి హేమలత, సామ అమర్నాథ్, గట్టు శ్రీనివాస్, కారెండ్ల హన్మండ్లు, క్యాస చంద్రశేఖర్ అనే వ్యక్తులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని అధికారులను వేడుకున్నారు ఫిర్యాదుదారులు.