మేము అడిగినవి ఏవీ కేంద్రం ఇవ్వలేదు: కేంద్ర బడ్జెట్పై శ్రీధర్ బాబు మండిపాటు

మేము అడిగినవి ఏవీ కేంద్రం ఇవ్వలేదు: కేంద్ర బడ్జెట్పై శ్రీధర్ బాబు మండిపాటు

హైదరాబాద్: తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపించినా.. బడ్జెట్‎లో రాష్ట్రానికి మోదీ సర్కార్ ద్రోహం చేసిందని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని ఆయన ఆరోపించారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాలకే బడ్జెట్లో కేటాయింపులు చేశారని.. ఎన్డీఏ భాగస్వామ్య రాష్ట్రాలకే నిధులు ఇచ్చారని విమర్శించారు.

కేంద్ర జీడీపీలో రాష్ట్రం వాటా 5 శాతం ఉన్నా నిధులు మాత్రం కేటాయించలేదని మంత్రి శ్రీధర్‌బాబు విమర్శించారు. పన్నుల రూపంలో రూ.26 వేల కోట్లు కేంద్రానికి వెళ్లాయని, రాజకీయ కారణాలతోనే తెలంగాణను చిన్నచూపు చూశారని ఆయన చెప్పారు. తమ విజ్ఞప్తులను కేంద్రం పట్టించుకోలేదని బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై మంత్రి శ్రీధర్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు.

ALSO READ | దేశ గతినే మార్చే అద్భుతమైన బడ్జెట్‌: కేంద్రమంత్రి బండి సంజయ్

ఇక మరో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. బీజేపీ నేతలు భిక్షాటన చేయడం కాదని, తెలంగాణకు ఏం ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. కేంద్రంతో బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం చేసుకుందని, రాష్ట్ర వాటా కోసం కేంద్రంపై పోరాటానికి తమతో బీఆర్ఎస్ కలిసిరావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.