కామారెడ్డి జిల్లా కేంద్రంలో అందమైన అమ్మాయిలుకావాలా అంటూ రాసి అతికించిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. పట్టణంలోని పలు కాలనీల్లో ఈ పోస్టర్లు అతికించారు. అందమైన అమ్మాయిలు కావాలంటే ఫోన్ లో సంప్రదించండి అని పోస్టర్లలో రాశారు. కాలనీల్లో కనిపించిన ఈ పోస్టర్లపై కామారెడ్డి పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనవాసాలమధ్య ఇలాంటి పోస్టర్లు ఏంటనీ ప్రశ్నిస్తున్నారు. ఈ పోస్టర్లు అతికించిన వారిని పట్టుకొని చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
కామారెడ్డి జిల్లా కేంద్రం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. వరుస దొంగతనాలకు, నేరాలకు పాల్పడుతున్న గంగాదాస్ అనే పాత నేరస్తున్ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అతని వద్ద నుంచి 25 కిలోల లక్ష్మీ నరసింహస్వామి పురాతన పంచలోహ విగ్రహం, 3 బైకులు, 30వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.